Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI: Good news for SBI customers ... new feature has arrived.

SBI : SBI కస్టమర్లకు గుడ్ న్యూస్ మరో కొత్త ఫీచర్ వచ్చేసింది.
SBI: Good news for SBI customers ... new feature has arrived.

SBI New Feature ఎస్ బీఐ కస్టమర్లకు శుభవార్త . మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI . ఆఫీచర్ తోమనకు ఉపయోగమేంటో తెలుసుకుందాం.
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? SBI ఏటీఎం నుంచి తరచూ డబ్బులు డ్రా చేస్తుంటారా? ఏటీఎం కేంద్రంగా జరిగే మోసాలకు అడ్డకట్ట వేసేందుకు SBI కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ ప్రమేయం లేకుండా ఏటీఎంలో ఏవైనా లావాదేవీలు జరిగితే మీకు వెంటనే సమాచారం వస్తుంది. దీని వల్ల మీరు అప్రమత్తం కావొచ్చు. మీ అకౌంట్‌లోని డబ్బులు మోసగాళ్ల అకౌంట్‌లోకి వెళ్లకుండా అప్రమత్తం కావొచ్చు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం మాత్రమే కాకుండా అనేక సేవలు లభిస్తాయి. బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. మినీ స్టేట్‌మెంట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇతర సేవల్ని పొందొచ్చు. అయితే ఏటీఎం కార్డు క్లోనింగ్ చేసి మోసగాళ్లు ఖాతాదారుల అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది SBI.
ఏటీఎంలో మీ కార్డుతో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా, మినీ స్టేట్‌మెంట్ రిక్వెస్ట్ చేసినా వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపనుంది SBI. దీనివల్ల మీరు అప్రమత్తం కావొచ్చు. మీరు కార్డు ఉపయోగించినప్పుడు సమస్య లేదు. కానీ మీ కార్డును ఎవరైనా ఉపయోగించి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ చూసేందుకు ప్రయత్నిస్తే మీ మొబైల్ నెంబర్‌కు సమాచారం లభిస్తుంది. ఒకవేళ మీరు ఆ సర్వీస్ ఉపయోగించనట్టైతే వెంటనే మీ కార్డును బ్లాక్ చేయొచ్చు. ఇలాంటి ఎస్ఎంఎస్‌లు వస్తే ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని SBI హెచ్చరిస్తోంది. మీ ప్రమేయం లేకుండా ఎవరైనా బ్యాలెన్స్ చెక్ చేయడానికి ప్రయత్నించినా, మినీ స్టేట్‌మెంట్ తీసుకున్నా మీరు వెంటనే అప్రమత్తం కావాలి. కార్డు బ్లాక్ చేయాలి. లేకపోతే మీ అకౌంట్ ఖాళీ కావొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇలాంటి అనేక ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్స్‌ని కస్టమర్లకు అందిస్తోంది. ఆన్‌లైన్ సేఫ్టీ టిప్స్ అందిస్తూ కస్టమర్లను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఇటీవలే 10 సేఫ్టీ టిప్స్‌ని వివరించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మీరు మోసపోకూడదంటే ఆ టిప్స్ పాటించడం తప్పనిసరి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI: Good news for SBI customers ... new feature has arrived."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0