Danger if unlocked like that WHO warning
అలా అన్‌లాక్ చేస్తే డేంజరే
WHO హెచ్చరిక
WHO హెచ్చరిక
- కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ అనేక దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి.
- దేశాలను అన్‌లాక్ చేస్తూ ఆర్థిక కార్యక్రమాల పునఃప్రారంభానికి మార్గం సుగమం చేస్తున్నాయి.
- అయితే వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టకుండా దేశాలను తెరిస్తే విపత్తు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
- వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలు.. ఈ మహమ్మారి పేట్రేగిపోయే ఘటనలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
- ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ సోమవారం నాడు వ్యాఖ్యానించారు.
- అయితే.. కరోనా సంక్షోభం ప్రారంభమై దాదాపు 8 నెలల కావస్తున్న తరుణంలో ఆంక్షల కారణంగా ప్రజలు విసిగిపోయారన్న వాస్తవాన్ని ఆయన అంగీకరించారు.
- ఆర్థిక సామాజిక కార్యకలాపాల పునఃప్రారంభానికి డబ్ల్యూహెచ్ఓ పూర్తిగా సమర్థిస్తోందని కూడా ఆయన స్పష్టం చేశారు.
- ‘పిల్లలు స్కూళ్లకు, పెద్దలు ఉద్యోగాలకు వెళ్లాలని మేమూ కోరుకుంటున్నాం. అయితే ఈ సమయంలో అందరూ క్షేమంగా ఉండాలన్నదే మా ఉద్దేశ్యం’*_ అని ఆయన వ్యాఖ్యానించారు.
- కరోనా సంక్షోభం సమసిపోయిందని ఏ దేశం కూడా భావించకూడదు.
- వైరస్ చాలా సులువుగా వ్యాపిస్తుందన్నది ఓ కఠిన వాస్తవం.
- ★ నియంత్రణ చర్యలు లేకుండా దేశాలను తెరిస్తే విపత్తును ఆహ్వానించినట్టే అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.
0 Response to "Danger if unlocked like that WHO warning"
Post a Comment