Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sensation in the study .. Coronavirus in the air like ..!

అధ్యయనంలో సంచలనం .. గాలిలో కరోనావైరస్ ఇలా .. !
Sensation in the study .. Coronavirus in the air like ..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది... ఇక, కరోనాకు కట్టడి కోసం... దాని ఉనికి గుర్తించడం కోసం.. వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది అనే దానిపై ఆదినుంచి రకరకాల పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త లక్షణాలు బయటకు వస్తూనే ఉన్నాయి... ఇక, ఎక్కడి నుంచి.. ఎవ్వరి నుంచి.. ఎలా.. వస్తుంది అనేదానిపై స్పష్టతమాత్రం రావడంలేదనే చెప్పాలి... గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం లేదన్న పరిశోధకులు.. ఆ తర్వాత క్రమంగా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మొదట్లో చాలా తక్కువ దూరమే గాలిలో ప్రయాణం చేయగలదని.. అది కూడా కొంత దూరం లోపే ఉంటుందని చెబుతూ వచ్చిన పరిశోధకలు.. ఇప్పుడు బాంబే పేల్చారు..

ఎందుకంటే.. గాలి ద్వారా 7 నుంచి 8 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఓ అధ్యయనం.
మాస్క్ ధరించడం భౌతికదూరం పాటించడం ఒక్కటే మార్గం
మాస్క్ ధరించడం.. భౌతికదూరం పాటించడం ఒక్కటే మార్గం అని చెబుతున్నారు.. భౌతికదూరం అంటే.. కొన్ని అడుగులే సాధ్యం... కానీ, జామా (జేఏఎంఏ) ఇంటన్నేషనల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. కరోనా బాధితుడితో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌ లేకపోయినా గాలి ద్వారా వైరస్‌ 7 నుంచి 8 మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చైనాలో ఈ ఏడాది మొదట్లో.. ఓ కరోనా రోగి ద్వారా 24 మందికి ఇదే విధంగా వైరస్ సోకినట్టుగా తేల్చింది అధ్యయనం.. కోవిడ్ సోకిన వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో.. అతడికి 7-8 మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా గాలి ద్వారా వైరస్‌ సోకినట్టుగా తేల్చారు. అయితే, అప్పటికి మాస్క్ తప్పనిసరి నిబంధన అక్కడ లేదు.. మాస్క్‌ ధరిస్తే.. దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అంటున్నారు. ఏదేమైనా... గాలిలో కరోనా వైరస్ 7-8 మీటర్ల దూరం వరకు వెళ్తుందనే ఈ అధ్యయనం తేల్చడంతో.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అసరమైతే ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sensation in the study .. Coronavirus in the air like ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0