Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sonu Sood Scholarships for gifted poor students

Sonu Sood Scholarships for gifted poor students
Sonu Sood Scholarships for gifted poor students

 ప్రతిభా వంతులైన పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

సోనూసూద్‌ పేద విద్యార్ధుల కోసం తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం రూపొందించాడు.

కరోనా కష్ట కాలంలో సినీనటుడు సోనూసూద్‌ చేసిన సాయం అంతాఇంతా కాదు. ఆయన సేవల్ని యావత్‌ ప్రపంచం కొనియాడింది.

ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తూ.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు.
రీల్‌ విలన్‌ కాస్త రియల్‌ హీరోగా కీర్తించబడుతున్నాడు.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అనగారిన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ఆయన ప్రకటించాడు.
వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెంది ఉండటమే కాక మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. 10 రోజుల్లో తమ వివరాలను scholarships@sonusood.me మెయిల్‌కు పంపాలని సోనూసూద్‌ పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో విద్య ఎంత ఖరీదైన వనరుగా మారిందో చూస్తున్నాం.
దాంతో చాలా మంది పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవ్వాలన్నా చాలా మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేవు. కొందరు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు.
ఈ క్రమంలో  నేను దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను.
మా అమ్మ గారు పంజాబ్‌ విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పారు. ఆమె స్ఫూర్తిని నేను కొనసాగించాలి అని అనుకుంటున్నాను’ అన్నారు. 
కోర్సులేంటి.. అర్హులేవరు..

  • ‘మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది.
  • లక్షల రూపాలయ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు.
  • కానీ వారికి మంచి మార్కులు వచ్చి ఉండాలి. అలాంటి వారి ఫీజు, వసతి, ఆహారం అన్ని విషయాలను మేమే చూసుకుంటాం’ అన్నారు సోనూ సూద్‌.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sonu Sood Scholarships for gifted poor students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0