Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The AP government has issued guidelines for conducting examinations in the context of corona.

కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ.
The AP government has issued guidelines for conducting examinations in the context of corona.

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నప్పటికీ ఈనెల 30వ తేదీలోపు ఫైనల్ ఇయర్, ఇతర సెమిస్టర్ పరీక్షలను పూర్తిచేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) ఇటీవల సూచించింది. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు (వారి తల్లిదండ్రులు,) పరీక్షలు నిర్వహించే సిబ్బంది ఎక్కువ గంటలు ఉండాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసినట్లు ఏపీ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.
1. సాధారణ నివారణ చర్యలు:
పరీక్షలు జరిగే పరిసర ప్రాంతాల్లో, పరిక్షలు నిర్వహించే ప్రాంతంలో సాధారణ ప్రజలు, విద్యార్థులు, పరీక్షా కేంద్రాల్లో ఉండే సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
వీటితో పాటు:

  • i. సాధ్యమైనంతవరకు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి.
  • ii. ఫేస్ కవర్లు / మాస్కులు ఉపయోగించడం తప్పనిసరి.
  • iii. తరచుగా చేతులను సబ్బు, నీటితో (కనీసం 40-60 సెకన్ల పాటు) కడుక్కోవడం చేయాలి. చేతులు మురికిగా లేకపోయినా చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లతో అయితే (కనీసం 20 సెకన్ల వరకు) పాటు చేతులను శుభ్రం చేయాలి. 
  • iv. తుమ్ము, దగ్గు వచ్చినపుడు మోచేతినిగానీ, హ్యాండ్ కర్చీఫ్ గాని, టిష్యూపేపర్ గానీ అడ్డుపెట్టుకోవాలి. వీటిని తప్పనిసరిగా పాటించాలి. టిష్యూపేపర్‌ను జాగ్రత్తగా పారవేయాలి.
  • v. అందరూ తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • vi. ఉమ్మి వేయడం నిషేధించబడింది.
  • vii. ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించేలా ప్రోత్సహించాలి.

2. యూనివర్సిటీలు/ విద్యా సంస్థలు/ పరీక్షలు నిర్వహించే అథారిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పరీక్షల నిర్వహణకు ప్రణాళిక:

  • a. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకూడదు. కంటైన్మెంట్ జోన్లలోని సిబ్బంది, విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించకూడదు. అలాంటి విద్యార్థులకు వేరే మార్గాల ద్వారా పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడమో, లేదంటే తదుపరి పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడమో, లేదంటే తదుపరి తేదీల్లో పరీక్షలు నిర్వహించడమో చేయాలని సూచించింది.
  • b. యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, పరీక్షలు నిర్వహించే అథారిటీలు, పరీక్షా కేంద్రాల దగ్గర ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో జనాలు పోగవకుండా అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. తద్వారా ఎక్కువ రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
  • c. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించే విధంగా విద్యార్థుల మధ్య దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలి. గదుల సామర్థ్యం ఇందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
  • d. అవసరానికి తగ్గట్లు ఫేస్​కవర్లు, మాస్కులు, శానిటైజర్​, సబ్బు, హైపోక్లోరైట్​ సొల్యూషన్​ లాంటి వాటిని ఏర్పాటు చేయాలి. పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టేటప్పుడు తమ ఆరోగ్య స్థితి గురించి పర్యవేక్షకులు, విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. అడ్మిట్ కిట్లు జారీచేసేటప్పుడే ఈ స్వీయ ధ్రువీకరణ పత్రం, పాటించాల్సిన, పాటించకూడని నిబంధనలు కూడా విద్యార్థులకు పంపిణీ చేయాలి.
  • e. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అడ్మిట్​ కార్డుతో సహా తెచ్చుకోవాల్సిన గుర్తింపుకార్డులు, ఫేస్​ మాస్క్​, నీళ్ల సీసాలు, హ్యాండ్​ శానిటైజర్ల గురించి విద్యార్థులకు ముందే సమాచారం అందించాలి.
  • f. భౌతిక నిబంధనలు పాటించడానికి అనుగుణంగా తగిన సంఖ్యలో రిజిస్ట్రేషన్​ గదులు, దస్తావేజుల పరిశీలన, అటెండెన్స్​ చూసుకోవడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
  • g. కొవిడ్​ నేపథ్యంలో పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి గురించి పర్యవేక్షణ సిబ్బందికి ముందే తర్ఫీదు ఇవ్వాలి.
  • h. కొవిడ్​-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే పోస్టర్లు, వీడియోలను పరీక్షాకేంద్రంల లోపల, బయట ప్రదర్శించాలి.
  • i. పరీక్షా కేంద్రాల దగ్గర లోపలికి వచ్చే సమయంలో స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎవరిలోనైనా కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే వెంటనే వేరుగా కూర్చోబెట్టడానికి ప్రత్యేకమైన గది కూడా ఏర్పాటు చేయాలి. వైద్య సలహా తీసుకొనేంతవరకు వారిని అందులోనే ఉంచాలి.

3. పరీక్షా కేంద్రాలకు దగ్గరకు చేరుకోవడానికి రవాణా సదుపాయాలు:
పరీక్షా కేంద్రాల దగ్గరకు చేరుకోవడానికి విద్యాసంస్థలు ఏమైనా రవాణా సదుపాయాలు కల్పించనట్టయితే బస్సులు, ఇతర రవాణా వాహణాలను తగినవిధంగా శానిటైజేషన్ చేయాలి.
4. పరీక్షా కేంద్రాల్లోకి రావడం-వెళ్లడం:

  • a. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అందర్నీ థర్మల్​ స్క్రీన్​ చేయాలి. తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్యం గురించి స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వని సిబ్బందిని గానీ, విద్యార్థిని గానీ లోపలికి అనుమతించకూడదు.
  • b. కొవిడ్ లక్షణాలు లేనివారిని మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలి.
  • c. కోవిడ్ లక్షణాలు కనిపించిన విద్యార్థులను సమీప ఆరోగ్య కేంద్రానికి పంపాలి. వారు వేరే విధానం ద్వారా పరీక్షలు రాసేలా చూడాలి.

5. పరీక్షా కేంద్రాలు/ సీట్ల ఏర్పాటు/ పరీక్షల నిర్వహణ

  • a. మాస్క్​/ఫేస్​కవర్​ ధరించిన సిబ్బంది, విద్యార్థులకే అనుమతివ్వాలి. పరీక్ష కేంద్రంలోకూడా అందరూ పరీక్షలు జరుగుతున్నంతసేపూ వాటిని ధరించే ఉండాలి.
  • b. థర్మల్​ స్క్రీనింగ్​ తర్వాత విద్యార్థులను తనిఖీ (ఫ్రిస్కింగ్​)చేసే సిబ్బంది తప్పనిసరిగా త్రిపుల్​లేయర్​ మెడికల్ ​మాస్క్, చేతికి తొడుగులు ధరించాలి. చేతి తొడుగులు మార్చుకున్న ప్రతిసారీ చేతులు తగిన విధంగా శుభ్రం చేసుకోవాలి.
  • c. పరీక్ష పూర్తయిన 72 గంటల తర్వాత సమాధాన పత్రాలను తెరవడం మంచిది.
  • d. పరీక్షా కేంద్రంలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత వస్తువుల పంపిణీ జరగకుండా చూడాలి.
  • e. ఏసీలు 24-30 డిగ్రీల మధ్యే నిర్వహించాలి. గదిలో తేమశాతం 40-70% ఉండేలా చూసుకోవాలి.

6. శానిటైజేషన్ మరియు పరిశుభ్రత:

  • a. పరీక్ష కేంద్రం, దాని పరిసర ప్రాంతాలను పరీక్ష ప్రారంభానికి ముందు తర్వాత శానిటైజేషన్ చేయాలి.
  • b. ముఖ్యంగా విద్యార్థులు, సిబ్బంది ఎక్కువగా వెళ్లే ప్రాంతాలైన చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాలు, నీరు తాగేచోట, లెట్రీన్, బాత్‌రూమ్‌లను తరచుగా శుభ్రం చేయాలి.
  • c. ఒకవేళ విద్యార్థిలో లక్షణాలు బయటపడిన తర్వాత కూడా పరీక్ష రాస్తానని పట్టుబడితే ప్రత్యేక ఏకాంత గదిలోకి మారిన తర్వాతే అనుమతించాలి.
  • d. లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి పంపాలి.
  • e. ఒకవేళ ఎవరైనా కోవిడ్ పాజిటివ్ గుర్తించినట్టయితే వెంటనే సంబంధిత ప్రదేశాన్ని క్రిమిసంహారకం చేయాలి. అతడు లేదా ఆమె సమాచారాన్ని తదుపరి చర్యల కోసం ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The AP government has issued guidelines for conducting examinations in the context of corona."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0