Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Adjustment of SA posts for high schools.

ఉన్నత పాఠశాలలకు ఎస్‌ఏ పోస్టుల సర్దుబాటు.

Adjustment of SA posts for high schools.


హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతులను స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి వారు బోధిస్తున్నారు. హేతుబద్ధీకరణలో ముందుగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని నిర్ణయించి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఫిజిక్స్‌, మాథ్స్‌, సైన్స్‌ బోధించే వారిని ఉన్నత పాఠశాలలకు సర్ధుబాటు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఉన్న 243 ప్రాథమికోన్నత పాఠశాలల్లో దాదాపుగా ఈ తరహా ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వారి స్థానంలో సెకండరీ గ్రేడ్‌ వారిని నియమించడానికి ఆ పోస్టులను ఖాళీగా చూపారు. బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో వాటిని ఎస్‌జీటీలు కోరుకుంటారు. ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనివల్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో సరైన బోధన సాధ్యపడదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్యాప్టో తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

రెండో దశ కసరత్తు పూర్తి

హేతుబద్ధీకరణ ప్రక్రియలో రెండో అంకం శుక్రవారం పూర్తయింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను గుర్తించారు. అలాగే ఎక్కడ వారి అవసరమో లెక్కలు తేల్చారు. పిల్లలు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు లేని చోటుకి ఆ పోస్టులు బదిలీ చేస్తారు. మొత్తం మీద 1094 మంది సెకండరీ గ్రేడ్‌ వారు అదనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిలో 338 మందిని అవసరమైన చోటకు సర్దుబాటు(నీడీ ప్లేస్‌కు) చేస్తారు. ఈ నెల 19న పదోన్నతులు నిర్వహించి, తరువాత హేతుబద్ధీకరణ అమలు చేస్తారు. ఈ రెండు పూర్తయ్యాక బదిలీల కౌన్సెలింగ్‌ చేపడతారు. దీనికోసం డీఈవో వీఎస్‌ సుబ్బారావు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మూడు దశల్లో జరిగే ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి సిబ్బందిని బృందాలుగా నియమించారు. క్యాన్సర్‌, కిడ్నీ, గుండె జబ్బులు, దివ్యాంగులు తదితర ప్రాధాన్యత విభాగాల వారికి బదిలీలలో ప్రాధాన్యం కల్పిస్తారు. ఈసారి అక్రమాలకు అవకాశం లేకుండా అలాంటి ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు అర్హులైన వారి సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డీఈవో వీఎస్‌ సుబ్బారావు తెలిపారు.

ఏమైనా అభ్యంతరాలు ఉంటే శనివారం సాయంత్రంలోగా తెలియజేయాలని కోరారు. పదోన్నతులు అయ్యాక హేతుబద్ధీకరణ ఉంటుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Adjustment of SA posts for high schools."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0