Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another 800 treatments in Arogya Sri

 ఆరోగ్య శ్రీ లో మరో 800 చికిత్సలు

Another 800 treatments in Arogya Sri

ఆరోగ్య శ్రీ పై ఏపీ సర్కార్ సీరియస్ గానే ఫోకస్ చేసింది. ఎలాంటి చికిత్స అయినా ఆరోగ్య శ్రీ లోనే అయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా 800 చికిత్సలు లిస్ట్ లో చేర్చింది. దీంతో మొత్తం 2200 కు చేరింద సంఖ్య. ఆరు జిల్లాల్లోని ఆరోగ్య శ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో నవంబర్ 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అనంతపురం, క్రిష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వచ్చే 13 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన జిల్లాల్లో ఇవి ఆల్రడీ ఉన్నాయట. ఇవే కాదు. ఇంకా అవసరమైతే.. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ని కూడా పరిశీలించి.. వాటిని కూడా ఆరోగ్య శ్రీ లిస్ట్ లో చేరుస్తాం అంటోంది ఏపీ సర్కార్.

నాడు నేడు లో భాగంగా.. వీటిపై రివ్యూ చేశారు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కొత్తగా రాబోయే 16 మెడికల్ కాలేజీలు..

ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల సమస్యల పరిష్కారానికి.. మొత్తం 17 వేల 300 కోట్లు ఖర్చు కాబోతుంది. కాలేజీల నిర్మాణాలకు జనవరి లోగా టెండర్లు పిలుస్తారట. దీనికోసం మొత్తం 7 వేల 5 వందల కోట్లకు పైగానే ఖర్చు అవుతోందంట.

ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో మౌలిక సదుపాయాల కోసం 5 వేల 4 వందల 72 కోట్లు మంజూరు చేస్తారట.నిర్మాణాల్లో హరిత విధానం పాటించాలని.. నిర్వహణలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కార్పొరేట్ ఆస్పత్రులను మించి ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి అన్నారు. ఆరోగ్య శ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో ఉన్న చికిత్సా వివరాలను..

గ్రామ సచివాలయాల్లో అందరికీ తెలిసేలా అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్డర్ చేశారు సీఎం. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్లనాని.. అధికారులు పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Another 800 treatments in Arogya Sri"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0