Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BSc seat with 40% marks.

40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు.

BSc seat with 40% marks.


ఈ ఏడాది నుంచే డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు

ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్‌ అమలు

 డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉంటే చాలు.. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, అటానమస్‌ డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీలో 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు కేటాయించనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు కూడా రిజర్వేషన్‌ విధానం అమలు కానుంది.

చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారిని.. శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాలకు స్థానికులుగా పరిగణిస్తారు.

ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిని ఆంధ్రా, ఆచార్య నాగార్జున, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాలకు స్థానికులుగా పరిగణిస్తారు.

మొత్తం సీట్లలో సూపర్‌ న్యూమరీగా 10% సీట్లను ఈడబ్ల్యుఎస్‌(ఆర్థికంగా వెనకబడిన బలహీనవర్గాలు) కోటాగా కేటాయిస్తారు.

ప్రతి కోర్సులోనూ మహిళల కోటా కింద 33.33% వర్తింపజేస్తారు. ఎన్‌సీసీ కోటాలో 1% సీట్లు కేటాయిస్తారు.

ఇంటర్‌లో కామర్సు ఒక సబ్జెక్టుగా చదివిన వారికి రాష్ట్రస్థాయిలో బీకామ్‌లో 60% సీట్లు కేటాయిస్తారు. సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ చదివిన వారికి.. బీఏ కోర్సుల్లో  50% సీట్లు కేటాయిస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BSc seat with 40% marks."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0