Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Disclosure of Secretariat's Exam Results

సచివాలయ’ పరీక్షల ఫలితాల వెల్లడి

Disclosure of Secretariat's Exam Results


  • నోటిఫికేషన్‌ నాటికి 16,208 పోస్టులు ఖాళీ
  • ప్రస్తుతానికి ఉన్న ఖాళీల సంఖ్య 18,048
  • జిల్లాల్లో మెరిట్‌ లిస్ట్‌ నుంచి కేటగిరీ ఆధారంగా మొత్తం ఖాళీల భర్తీకి నిర్ణయం
  • ఈసారి కటాఫ్‌ లేదు.. పరీక్ష రాసిన వారందరికీ మార్కుల ఆధారంగా ర్యాంకులు
  • వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ ప్రారంభం

ఏపీ గ్రామ‌/వార్డు స‌చివాల‌య ప‌రీక్ష‌ల టాపర్లు, క‌టాఫ్ మార్కులు.. తదుపరి ప్రక్రియ వివరాలు ఇవే..!

ఈ పరీక్షలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన క‌టాఫ్ మార్కుల వివ‌రాలు కేట‌గిరీల వారీగా ఇలా ఉన్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు

  • ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 111 మార్కులు
  • బీసీ కేటగిరిలో అత్యధికంగా 111 మార్కులు
  • ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా 99.75 మార్కులు
  • ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా 82.75 మార్కులు
  • మ‌హిళా అభ్య‌ర్థుల్లో గ‌రిష్ఠంగా 98 మార్కులు
  • పురుష అభ్య‌ర్థుల్లో గ‌రిష్ఠంగా 111 మార్కులు సాధించారు

టాపర్ల జాబితా:

ఏపీ గ్రామ‌, వార్డ్ సచివాల‌య ప‌రీక్ష‌ల టాప‌ర్ల వివ‌రాల‌ను ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వీరిలో ఏ.బాలాజీ 150 మార్కుల‌కు గాను 111 మార్కుల‌తో మొద‌టి స్థానం సాధించారు. త‌రువాత 105.25 మార్కుల‌తో కుందుల పూజా విహారి, 102.25 మార్కుల‌తో ఏ. చైత‌న్య మాధ‌వుడు వ‌రుస‌గా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

వారంలో భర్తీ ప్రక్రియ షురూ

  • ర్యాంకుల ఆధారంగా జిల్లాల్లో మరో వారం రోజుల్లో కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
  • జిల్లాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం అర్హులైన అభ్యర్థులను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ప్రకారం ఎంపిక చేసి ప్రొవిజనల్‌ సెలక్షన్‌ లెటర్స్‌ పంపుతారు. 
  • ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు వారి సర్వీస్‌ను బట్టి గరిష్టంగా 15 మార్కులు కలిపి జాబితాలను రూపొందిస్తారు.
  • అనంతరం ప్రతి పోస్టుకూ క్వాలిఫైయింగ్‌ మార్కులను పోస్టుల లభ్యతను బట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీలు నిర్ణయిస్తాయి. 
  • ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ ప్రతులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • తరువాత కలెక్టర్లు ప్రకటించే తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది.

మహిళలే ఎక్కువ

  • గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న పంచాయతీరాజ్, పురపాలక శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయగా.. 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
  • రాత పరీక్షలకు ·7,68,965 మంది హాజరయ్యారు. వీరిలో 3,84,229 మంది పురుషులు కాగా, 3,84,736 మంది మహిళలు ఉన్నారు. 
  • పరీక్షలు రాసిన వారిలో ఓసీలు 1,00,854 మంది, బీసీలు 3,88,043 మంది,  ఎస్సీ కేటగిరీలో 2,24,876 మంది, ఎస్టీ కేటగిరీలో 55,192 మంది ఉన్నారు.

రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ

ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటే నిరుద్యోగ యువతలో ఆశలు నింపుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఫలితాల వెల్లడి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 1.26 లక్షల సచివాలయ ఉద్యోగాల భర్తీకి అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్‌మెంట్‌ ద్వారా లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంత పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవన్నారు.

వెబ్‌సైట్‌లో ఫలితాల వివరాలు

పరీక్షలకు హాజరైన 7,68,965 మంది అభ్యర్థుల మెరిట్‌ జాబితాలు గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థి హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాన్ని ఈ దిగువ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. 

http:// gramasachivalayam.ap.gov.in/

http:// vsws.ap.gov.in/

http:// wardsachivalayam.ap.gov.in/


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Disclosure of Secretariat's Exam Results"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0