Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Experts warn that 'Corona second phase' begins in the state!

బడి భయం

Experts warn that 'Corona second phase' begins in the state!


  • ట్యూషన్లకు వెళ్లినవారికి పాజిటివ్‌
  • స్కూళ్ల ప్రారంభంపై ఆరోగ్యశాఖ ఆందోళన
  • అన్‌లాక్‌ 5తో తెరుచుకోనున్న థియేటర్లు
  • ఊరేగింపులు, ఉత్సవాలకూ అనుమతి
  • నవంబరులో రెండో విడత కరోనాకు చాన్స్‌
  • బడి తెరిచిన దేశాల్లో రెండోసారి లాక్‌డౌన్‌
  • అమెరికా, దక్షిణ కొరియా దేశాలే నిదర్శనం


నవంబరు 2 నుంచి బడులు తెరుస్తామంటున్న సర్కారు! రాష్ట్రంలో ‘కరోనా రెండో దశ’ మొదలవు తుందంటూ నిపుణుల హెచ్చరికలు! దీంతో... ఇప్పుడు బడులు తెరవడం మంచిదేనా? పాఠశాలల తలుపులు తెరవడమంటే... కరోనాను స్వాగతించడమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రుల్లోనూ అతికొద్ది మంది మాత్రమే పిల్లలను బడికి పంపేందుకు ఇష్టపడుతున్నారు.


రాష్ట్రంలో కరోనా రెండోదశ ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు వరకూ కేసులు నమోదైన తీరును ప్రస్తుత పరిస్థితితో పోల్చి చూస్తే సెకండ్‌ వేవ్‌ తప్పదని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుదన్నది ప్రశ్నార్థకంగా మారింది. చాలా దేశాల్లో కరోనా రెండోదశ ఇప్పటికే ప్రారంభమైంది. వైద్యులు, పరిశోధకుల సూచనలు పట్టించుకోకుండా అక్కడి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తేయడం, పాఠశాలలు, థియేటర్లు తెరవడంతో రెండో విడతలో కేసులు భారీగా పెరిగాయి. ఆమెరికా, దక్షిణ కొరియాల్లో బడులు తెరిచిన తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆక్కడ రెండోసారి లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అన్‌లాక్‌ 5.0లో భాగంగా వచ్చిన సడలింపులతో ఈనెల 15వ తేదీ నుంచి షరతులకు లోబడి సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరుపుకోవచ్చు. దీంతోపాటు... థియేటర్లకూ అనుమతి ఇస్తున్నారు.

ఇవన్నీ కరోనా రెండో దశకు కారణమయ్యే అవకాశముంది. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చిన్న వయసు వారిలో కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. బడులు లేకపోవడం, తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించకపోవడంతో వారు కొంత సేఫ్‌జోన్‌లో ఉన్నారు. పాఠశాలలు ప్రారంభమైతే ఈ పరిస్థితి తారుమారవచ్చు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ట్యూషన్‌కు వెళ్లిన 20మందికి పిల్లలకు పాజిటివ్‌ వచ్చింది. ఆ పిల్లల నుంచి వారి తల్లిదండ్రులకు, పెద్దలకు కరోనా సోకింది. ఇక బడులు తెరిస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒక్కసారే తగ్గితే ముప్పు

1918లో విజృంభించిన ‘ప్రాన్స్‌ ఫ్లూ’ మహమ్మారి మొదటి, రెండో విడతల్లో కలిపి సుమారు 5కోట్ల మంది ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం కరోనా కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. ఫ్లూ, వైర్‌సలు దాడిచేసిన తర్వాత తొలి కేసు నమోదైన నాటినుంచి 6నెలల వరకూ బీభత్సం సృష్టిస్తాయి. తర్వాత నిదానంగా తగ్గుముఖం పడతాయి. ఆ సమయంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల సెకండ్‌ వేవ్‌కు అవకాశం ఉండటంతో పాటు రెండోసారి వైరస్‌ మరింత ఉధృతంగా మారుతుందనడానికి ఇదో సంకేతంగా చెబుతున్నారు. సెప్టెంబరు నెలాఖరు వరకూ ఏపీలో రోజుకు పది వేల వరకూ కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 1 నుంచి వాటి సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఈ విధంగా కేసుల సంఖ్య ఒకేసారి తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

నవంబరు తర్వాతే

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5వేలకు చేరింది. ఈ నెలాఖరుకు ఇది వెయ్యి నుంచి 2వేలకు తగ్గే అవకాశాలున్నాయి. మరణాల సంఖ్య కూడా 50 శాతం తగ్గింది. దీన్నిబట్టి నవంబరు తర్వాత రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చేనెలలో బడులు ప్రారంభం కాకపోతే కేసులు, మరణాలు ఆరోగ్యశాఖ భావిస్తున్నంత తీవ్రస్థాయిలో నమోదు కావు. అందువల్ల ఈ సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు స్కూళ్లు ప్రారంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మరో 2నెలల పాటు బడులు తెరవకపోవడమే మేలన్న ఆలోచనలో ఆరోగ్యశాఖ ఉంది. ఇదే సమయంలో సినిమా హాళ్లు, మాల్స్‌ ద్వారా కూడా 20-30శాతం కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

యువతే సూపర్‌ స్ర్పెడర్స్‌

తమిళనాడు, ఏపీలపై కాలిఫోర్నియావర్సిటీ, ఇండియన్‌ ఎపిడమాలజిస్టులు సంయుక్తంగా ఒక పరిశోధన చేశారు. ఈమేరకు రాష్ట్రంలో 8శాతం మంది 80శాతం మందికి వైరస్‌ వ్యాప్తి చేశారు. ఇందులో 5-17ఏళ్ల లోపువారే 70% ఉన్నారు. 60ఏళ్లు దాటి షుగర్‌ ఉన్నవారిలో 23ు మంది, 40ఏళ్లు దాటి బీపీ ఉన్నవారు 22% మంది చనిపోయారు. 16-30ఏళ్ల మధ్య ఉన్న 5ు మందిలో వైరస్‌ నేరుగా కిడ్నీలపై దాడి చేసి బలి తీసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో మరణాల రేటు 2.6% ఉందని ఆ పరిశోధనలో తేలింది. కానీ ఆరోగ్యశాఖ మాత్రం ఈ రేటు 1.5కు మించకుండా చూపించింది. ఏపీపై కరోనా భారీగా ప్రభావం చూపిందని సర్వే తేల్చి చెప్పింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Experts warn that 'Corona second phase' begins in the state!"

Post a comment