Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Life time validity of TET qualified candidates.

 టెట్ విషయంలో కీలక నిర్ణయం 

Life time validity of TET qualified candidates.

టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు ( TET ) విషయంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ( NCTE ) కీలక నిర్ణయం తీసుకుంది . టెట్ ఒకసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ వాల్యూ జీవితకాలం ఉంటుందని ప్రకటించింది . కాగా ఇప్పటివరకు టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది . తాజా నిర్ణయం భవిష్యత్ లో TET రాసే వారికి మాత్రమే అమలు కానుంది . గతంలో పరీక్ష రాసి అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుంటామని NCTE పేర్కొంది .

CTET & TET 2020: NCTE Extends Teacher Eligibility Test Certificate Validity for Lifetime.

టీచర్‌ వృత్తి స్వీకరించే వారికి గుడ్‌న్యూస్‌.. NCTE కీలక నిర్ణయం.. టెట్‌, సీటెట్‌ స్కోర్‌కు లైఫ్‌ టైమ్‌ వ్యాలిడిటీ..!

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE).. టెట్‌, సీటెట్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

సబ్జెక్ట్‌‌:

తాజాగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE).. టెట్‌, సీటెట్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెట్‌, సీటెట్‌ స్కోర్‌కు ఏడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంది. అంటే.. ఒకసారి టెట్‌లోగానీ, సీటెట్‌లో గాని అర్హత సాధిస్తే ఆ స్కోర్‌ 7 ఏళ్లు చెల్లుబాటవుతుంది. అప్పటి వరకు రాష్ట్ర, నేషనల్‌ స్థాయిలో పడే టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడేళ్ల తరువాత ఆ స్కోర్‌ చెల్లుబాటు కాదు. 

లైఫ్‌ టైమ్ ప్రతిపాదన: ‌

అయితే తాజాగా ఎన్‌సీటీఈ ఈ విధానాన్ని మార్చి.. లైఫ్‌ టైమ్‌ (జీవిత కాలం) వ్యాలిడిటీ ఉండేలా ప్రతిపాదన తీసుకొచ్చింది. అంటే ఒక సారి టెట్‌, సీటెట్‌ లోగాని అర్హత సాధిస్తే.. ఆ స్కోర్‌ జీవిత కాలం చెల్లుబాటయ్యేలా మార్చాలనే ప్రతిపాదన చేస్తోంది. దీనివల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు చేసినవాళ్లం అవుతామనే వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పటికిది ప్రతిపాదన మాత్రమే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

నేపథ్యం:

టెట్ లేదా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఉపాధ్యాయ అర్హత పరీక్ష. మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి అనుకునే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష. ఇందులో 1 నుండి 5 తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయుల (ఎస్‌జీటీ) కు పేపర్-1 పరీక్ష ఉంటుంది. అలాగే 6వ తరగతి నుండి 10 తరగతి బోధించే ఉపాధ్యాయుల (స్కూల్‌ అసిస్టెంట్‌)కు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. 

కేంద్రప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. టీచర్‌గా స్థిరపడాలంటే.. ఈ పరిక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో కూడా టెట్‌కు వెయిటేజీ ఇస్తారు. 

2011లో ప్రారంభం:

బోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను 2011 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వాళ్లు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ పరీక్షలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారే డీఎస్సీ రాయడానికి అర్హులు. ఈ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో:

జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజి ఉంటుంది. టెట్‌లో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు (ఎస్‌జీటీ) పేపర్‌-1 పరీక్ష రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు (స్కూల్‌ అసిస్టెంట్‌) పేపర్‌-2 పరీక్ష రాయాలి. 

మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీ అభ్యర్థులు75 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / దివ్యాంగులు 60 మార్కులు క్వాలిఫైయింగ్‌ మార్కులుగా సాధించాలి. టెట్‌ స్కోర్‌ ఏడేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. 

కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష:

సెట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (సీటెట్). దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది.1వ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి ఈ అర్హత పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లతో పాటు రాష్ట్రస్థాయి స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల దరఖాస్తుకు అవసరమైన అర్హత లభిస్తుంది. 


ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1వ నుంచి 5వ తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 1 నిర్వహిస్తారు. 6-8 తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 2 నిర్వహిస్తారు. సీటెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఉత్తీర్ణులకు ఏడేళ్ల గుర్తింపుతో సర్టిఫికెట్ జారీ చేస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Life time validity of TET qualified candidates. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0