Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Traffic Violation Penalties

  ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది

New Traffic Violation Penalties


రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానాను.. ఇతర వాహనాలకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.

ఆ జరిమానాలు ఇలా ఉన్నాయి.

  • వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750
  • సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750
  • అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000
  • అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000
  • డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000
  • రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000
  • వేగంగా బండి నడిపితే - రూ. 1000
  • సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000
  • రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
  • రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
  • పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000
  • ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
  • వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000
  • ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000
  • అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
  • రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి - రూ. లక్ష


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Traffic Violation Penalties"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0