Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lunch workers should not wear these: Central Education Conditions

 మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు : కేంద్ర విద్యాశాఖ షరతులు

Lunch workers should not wear these: Central Education Conditions

Mid-day meal workers: పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.

గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ తెలిపారు.


  • మార్గదర్శకాలివే:
  • మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.
  • పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.
  • పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.
  • మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.
  • నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.
  • వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.
  • ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.
  • మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.
  • కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.
  • అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.
  • సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.
  • భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lunch workers should not wear these: Central Education Conditions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0