Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Using 'Phone Pay'? Save these customer care details carefully. Very useful.

 ' ఫోన్ పే ' వాడుతున్నారా ? ఈ కస్టమర్ కేర్ వివరాలు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి.చాలా ఉపయోగకరం.

Using 'Phone Pay'? Save these customer care details carefully. Very useful.

UPI అప్లికేషన్స్ వినియోగం బాగా పెరిగిన తర్వాత అనేక రకాల సైబర్ కంప్లైంట్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మీరు PhonePe వాడుతున్నట్లయితే ఒకవేళ ఏదైనా లావాదేవీ సరిగా పూర్తి కాకపోయినా, లేదా ఏదైనా ఫ్రాడ్ లావాదేవీ UPI ఆధారంగా జరిగినా ఇప్పుడు చెప్పబోతున్న వివరాలు మీకు బాగా ఉపయోగపడతాయి. వీటిని చాలా జాగ్రత్తగా మీ ఫోన్లో సేవ్ చేసుకోండి.


చాలామంది PhonePe కస్టమర్ కేర్ నెంబర్ కోసం Google, Youtubeలో వెదికి కనిపించిన ప్రతీ నెంబర్‌కీ కాల్ చేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ప్రమాదకరం. చాలామంది ఫ్రాడ్ చేసే వ్యక్తులు PhonePe కస్టమర్ సపోర్ట్ అని ఒక నకిలీ నెంబర్ ఇంటర్నెట్ లో పెట్టి, ఎవరైనా బాధితులు కాల్ చేస్తే వారినుండి కీలకమైన సమాచారాన్ని అడిగి వారి బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ చేస్తున్నారు.


ఈ నేపధ్యంలో మీరు PhonePe అధికారికంగా అందించే కస్టమర్ కేర్ నెంబర్ మాత్రమే ఉపయోగించాలి. PhonePe కస్టమర్ సపోర్ట్ నెంబర్ 080-68727374. లేదా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో https://support.phonepe.com/ అనే సైట్ లో లాగిన్ అయి మీకు వచ్చిన సమస్య గురించి కంప్లైంట్ చేయొచ్చు. 24 గంటల పాటు, వారానికి ఏడు రోజులపాటు మీ కంప్లైంట్స్ స్వీకరించబడతాయి. ఒకవేళ మీ సమస్య అప్పటికీ పరిష్కారం కాకపోతే, ఆ సంస్థకు చెందిన నోడల్ ఆఫీసర్ అనుజ్ భన్సాలీకి ఫిర్యాదు చేయమని ఆ సంస్థ చెబుతోంది. ఆ నోడల్ ఆఫీసర్ పూర్తి వివరాలు ఇక్కడ.


Contact Name: Anuj Bhansali


Email: grievances@phonepe.com


Phone: 080-68727374/022-68727374


Address- Ashford Park View, Site No - 9 Industrial Layout,


Koramangala 3rd Block, 80 ft Road, Bangalore-560034, India.


Working hours: Mon-Fri 10 am to 7 pm


ఇలా నోడల్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేసేటప్పుడు మీ పేరు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇంతకుముందు మీరు చేసిన కంప్లైంట్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు పేర్కొనవలసి ఉంటుంది. PhonePe మొబైల్ యాప్‌లో కూడా పూర్తిగా కస్టమర్ కేర్ వివరాలు అందుబాటులో ఉంటాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Using 'Phone Pay'? Save these customer care details carefully. Very useful."

  1. Dear sir. From your phone pe my money Rs. 5000.is gone to( getpayments. Upi). Please enquiry immediately and cashback immediately

    ReplyDelete
  2. My money Rs. 5000.is gone to (getpayments)upi. So please enquiry immediately and cashback please. Immediately

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0