Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Rules for PPF, Senior Citizen Savings Scheme Claims

పీపీఎఫ్‌, సీనియ‌ర్ సిటిజిన్ సేవింగ్ స్కీమ్‌ క్లెయిమ్‌ల‌ కొత్త నియమాలు

New Rules for PPF, Senior Citizen Savings Scheme Claims


క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు డిపాజిట‌ర్ చనిపోయిన రోజు నుంచి 6 నెల‌లు వేచియుండాలి

ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌), సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌ల‌తో స‌హా పోస్ట్ ఆఫ‌స్ పొదుపు ప‌థ‌కాల‌కు సంబంధించి మ‌ర‌ణించిన‌ ఖాతాదారుని త‌రుపున నామినీ లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన ఆధారాలు లేన‌ప్పుడు దావాల‌ను ప‌రిష్క‌రించేందుకు గానూ అధికారుల నిబంధ‌న‌ల‌ను పోస్ట‌ల్ విభాగం స‌వ‌రించింది. మే20,2019 ఉత్తర్వుల ప్ర‌కారం, వివిధ స్థాయిల అధికారులు, మ‌ర‌ణించిన వ్య‌క్తి చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కు మంజూరు చేయ‌గ‌ల మొత్తాన్ని పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. మంజూరుకు ఎంత స‌మ‌యం వేచి ఉండాలి అనే అంశాల‌ను కూడా ఉత్త‌ర్వుల‌లో వెల్ల‌డించింది.

ఉత్త‌ర్వుల ప్ర‌కారం కింద తెలిపిన అధికారులు వారిని అనుమ‌తించిన ప‌రిధి మేర‌కు వార‌స‌త్వ ధృవీక‌ర‌ణ ప‌త్రం లేకుండా క్లెయిమ్‌ల‌ను మంజూరు చేయ‌వ‌చ్చు. డిపాజిటర్ చ‌నిపోయిన రోజు నుంచి 6 నెల‌ల పూర్తైన త‌రువాత మంజూరు స‌ర్టిఫికేట్ లేదా వీలునామా లేదా విల్లు లేదా మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రం లేక‌పోతే అధికారుల‌కు ఇచ్చిన ప‌రిధి మేర‌కు మంజూరు చేయ‌వ‌చ్చు.

  • స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ - రూ.5 వేలు
  • లోయ‌ర్ సెల‌క్ష‌న్ గ్రేడ్‌లోని స‌బ్ పోస్ట్‌మాస్ట‌ర్‌/ పీఎమ్ గ్రేడ్‌-I - రూ.10 వేలు
  • స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్లు/ డిప్యూటీ పోస్ట్ మాస్ట‌ర్‌/ హైయ‌ర్ గ్రేడ‌ర్‌లోని పోస్ట్ మాస్ట‌ర్లు(నాన్ గెజిటేటెట‌డ్‌)/ పీఎమ్ గ్రేడ్‌-II/III - రూ.25వేలు
  • డిప్యూటీ పోస్ట్ మాస్ట‌ర్లు/ సీనియ‌ర్ పోస్ట్ మాస్ట‌ర్లు/ డిప్యూటీ చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్లు/ పోస్టాఫీసు సూప‌రెండెంట్‌/ పోస్టాఫీసు డిప్యూటీ సూప‌రెండెంట్‌( గెజిటెడ్ గ్రూప్‌-బీ) - రూ. 1 ల‌క్ష‌
  • జీపీఓ చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్లు/ హెడ్ ఆఫీసెస్‌, పోస్టాఫీసు సీనియ‌ర్ సూప‌రెండెంట్లు(గెజిటెడ్ గ్రూప్‌-ఏ ) - 2.5 ల‌క్ష‌లు
  • హెచ్‌క్యూ డైరెక్ట‌ర్‌/ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్లు/ డైరెక్ట‌ర్(జీపీఓ) - రూ.3.75 ల‌క్ష‌లు
  • చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్‌/ పోస్ట్‌మాస్ట‌ర్స్ జ‌న‌ర‌ల్ - రూ.5 ల‌క్ష‌లు

ఆగ‌ష్టు 29 నోటిఫికేష‌న్ త‌రువాత‌, పున‌రుద్ధ‌రించిన నియ‌మాలు, నామినీ లేని చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు లేని పీపీఎఫ్‌(ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌), సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌)కు కూడా వ‌ర్తిస్తాయ‌ని పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, మిగిలిన ప‌థ‌కాల‌తో పాటు పీపీఎఫ్,ఎస్‌సీఎస్ఎస్‌ కేసులకు కూడా మే 20 నోటిఫికేషన్‌లో చట్టపరమైన సాక్ష్యాలు లేని క్లెయిమ్‌ల‌కు, అధికారులకు సూచించిన పరిధి మేర‌కు మంజూరు చేసే నియమాలు వర్తిస్తాయ‌ని స్పష్టం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Rules for PPF, Senior Citizen Savings Scheme Claims"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0