Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prepare JAGANANNA VIDYAKANUKA

విద్యా కానుక సిద్ధం

Prepare JAGANANNA VIDYAKANUKA

అమ్మ ఒడి కార్యక్రమం అమలు సందర్భంలో నమోదైన వివరాల ఆధారంగా వీటిని పంపిణీ చేస్తారు.

విద్యాకానుక కిట్‌లో మొత్తం 7 రకాల వస్తువులుంటాయి. సంచి, బూట్లు, సాక్సు, బెల్ట్‌, ఏకరూప దుస్తులు, రాత, పాఠ్య పుస్తకాలలో ఏమైనా సక్రమంగా లేకపోతే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఎంఈవోను సంప్రదించాలి.

ప్రాథమిక పాఠశాలల్లో అయిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో కిట్లను తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

2019-20లో నమోదైన ప్రవేశాల ఆధారంగా పాఠశాలల్లో కిట్లను సిద్ధం చేశారు. ఒకటి రెండు చోట్ల కిట్లు అందకపోయినా మలి విడతలో అందజేస్తారు

విద్యాకానుకల సామగ్రిని అందించే సందర్భంలో విద్యార్థుల తల్లుల ఐరిస్‌ లేదా బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి. వీలైనంత వరకు ఐరిస్‌ నమోదుకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను శానిటేషన్‌ చేశారు. లబ్ధిదారులు మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

తరగతుల వారీగా సామగ్రి

1-3 తరగతులకు చిన్న, 4-6 తరగతులకు మధ్యతరహా, 7-10 తరగతులకు పెద్ద పరిమాణాల్లో బ్యాగులు అందిస్తారు. బాలురకు నేవీబ్లూ, బాలికలకు స్కైబ్లూ రంగుల సంచులు అందజేయనున్నారు.

బూట్లు, సాక్సులకు సంబంధించి గతంలోనే కొలతలు సేకరించారు. ఆ మేరకు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు సరఫరా చేస్తారు.

ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు మాత్రమే రాత పుస్తకాలు పంపిణీ చేస్తారు. 1-5 తరగతుల విద్యార్థులకు కొత్తగా రూపొందించిన సిలబస్‌ ప్రకారం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ముద్రించిన పాఠ్య పుస్తకాలతోపాటు ప్రతి సబ్జెక్టుకు వర్క్‌బుక్‌ పంపిణీ చేస్తారు.

ఆరో తరగతి వరకు నూతన సిలబస్‌ ప్రకారం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, 7-10 తరగతులకు పాత సిలబస్‌ ప్రకారం ముద్రించిన పాఠ్య పుస్తకాలను అందిస్తారు.

జగనన్న విద్యా కానుక Android App లో Mother / Guardian Aadhar నెంబర్ తప్పుగా ఉన్న అసలు ఆధార్ నెంబర్ లేకపోయినా ఏ విధంగా Mother ఆధార్ నెంబర్ అప్డేట్ చేయాలో పూర్తి విధానం క్రింది వీడియోలో చూడగలరు



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prepare JAGANANNA VIDYAKANUKA "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0