Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

When you wake up from sleep, it is a health problem. These are the precautions to be taken.

నిద్రలో మెలకువ వస్తే ఆరోగ్యానికి సమస్యే..తీసుకోవల్సిన జాగ్రత్తలివే..
When you wake up from sleep, it is a health problem. These are the precautions to be taken.


రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రి హాయిగా నిద్ర పోవాలి. కానీ మంచి నిద్ర ఎంత మందికి దొరుకుతుంది?  లైఫ్‌‌స్టైల్ ఎంతో హెల్దీగా ఉంటే కానీ అలా జరగదు. ఆరోగ్యానికి నిద్రకు లింక్ ఉంది. నిద్ర పోయే సమయాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిద్ర మధ్యలో మెలకువ వచ్చే టైంని బట్టి కూడా హెల్త్ ఎలా ఉందో డిసైడ్ చేయొచ్చు.

చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అయితే  రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు. మెలకువ వచ్చే  టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చంటున్నారు.
రిపేరింగ్ టైం..
నిద్ర పోయేటప్పుడు శరీరం.. ప్రాబ్లమ్స్‌‌ను రిపేర్ చేసుకుంటుంది. ఆరోజులో జరిగిన మెంటల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌‌ను  బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. హార్మోన్స్‌‌ను సమతుల్యం చేసి, మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ రాత్రంతా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది.
ఒక్కో అవయవానికి ఒక్కో టైం ఉంటుంది. ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ఉంటే పనికి ఆటంకం జరిగి, శరీరం మేల్కొంటుంది. అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చన్న మాట.

శరీరం నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్‌‌ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. వాటిని అర్ధం చేసుకొని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. నిద్రకు ఆటంకం కలుగుతుందంటే… ఎక్కడో, ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లమ్‌‌ని ఎలా కనిపెట్టాలో చూద్దాం.

9–11 మధ్య మెలుకువ వస్తే
తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు లోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11  గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు అర్ధం. అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్‌‌గా ఉంటుంది. ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుందంటే.. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్లు ఆరోగ్యకరమైన లైఫ్‌‌స్టైల్‌‌ని అలవరచుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్–ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మెడిటేషన్ చేయడం, శుభ్రమైన నీళ్లు తాగడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
11-1 మధ్య మెలుకువ వస్తే
సాధారణంగా రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం) శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే  పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్లి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది.  ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి  ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే..  గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం. ఇలాంటి వాళ్లు  డైట్‌‌లో అన్‌‌హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్‌‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి.
1-3 మధ్య మెలుకువ వస్తే
ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది.  శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌‌‌‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం.  రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది. కాలేయం జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్​ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో మెలకువ వచ్చే వాళ్లు  ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు, ఆహారం కలుషితంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది.
3-5 మధ్య మెలుకువ వస్తే
3 గంటల నుంచి 5 గంటల మధ్యలో  ఊపిరితిత్తులు ఆక్సిజన్‌‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్  అందే సమయం ఇదే. ఈ సమయంలో  మెలకువ వస్తోందంటే  లంగ్స్‌‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు  రెగ్యులర్‌‌‌‌గా బ్రీతింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు లైట్‌‌ ఫుడ్‌‌ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా ఆడుతుంది.
5-7 మధ్య మెలుకువ వస్తే
5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది. ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే..  శరీరం తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు తయారవుతుంది. ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది.
ఇవి కూడా గమనించగలరు 
  • ఎక్కువగా టీవీ చూడడం, మొబైల్ వాడడం, జంక్ ఫుడ్ తినడం, మద్యం, సిగరెట్ల లాంటి అలవాట్లు నిద్రను పాడుచేస్తాయి. 
  • నిద్ర సరిగా లేకపోతే అవయవాల పనితీరు మందగించి, బీపీ పెరగడం, గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.
  • మంచి నిద్ర కోసం..
  • నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి.
  • 6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆల్కహాల్​, సిగరెట్‌‌ అలవాట్లకు దూరంగా ఉండాలి.
  • పడుకునే ముందు స్నానం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించాలి.
  • రాత్రిళ్లు టీవీ చూడడం, సెల్‌‌ఫోన్‌‌ వాడడం తగ్గించాలి....


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "When you wake up from sleep, it is a health problem. These are the precautions to be taken."

Post a comment