Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Transfers 2020

 బదిలీలు తప్పుల కుప్పలు

AP Transfers 2020

  • పాయింట్ల కోసం  టీచర్ల అడ్డదారులు 
  •  స్పౌజ్ కాకపోయినా దరఖాస్తు 
  • గుడ్డిగా అప్లోడ్ చేసిన హెచ్ఎం , ఎంఈఓలు
  •  సీనియార్టీ జాబితాలో ముందుకెళ్లిన అక్రమార్కులు 
  •  జిల్లాలో 340 అక్రమ స్పౌజ్ దరఖాస్తులు

అనంతపురం:ఉపాధ్యాయ బదిలీల్లో పాయింట్లు పొందేందుకు లేనిది ఉన్నట్లు చూపుతున్నారు . కొం దరు నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తే .. మరికొం దరు తమ భార్య / భర్తను ప్రభుత్వ ఉద్యోగి కాక పోయినా స్పౌజ్ కోటాలో దరఖాస్తు చేసుకుని జాబి తాలో ముందు వరుసలో చేరిపోయారు . 

నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు

 భార్య , భర్త వేర్వేరు స్థానాల్లో విధులు నిర్వర్తించకుం డా సమీప స్థానాల్లో పనిచేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ వెసులుబాటు కల్పించింది . ఇం దుకు సంబంధించిన విధివిధానాలు జీఓ 54 , 55 లో స్పష్టం చేసింది . భార్య / భర్త కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థలకు సంబంధించిన సచివాలయాల్లో పనిచేస్తున్న వారు ఉంటే ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు . అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగు లకు ఇది వర్తించదని జీఓ స్పష్టంగా చెబుతోంది . కానీ కొందరు టీచర్లు తమ జీవితభాగస్వామి కాం ట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నా .. స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకున్నారు .

 340 అక్రమ దరఖాస్తులు

జిల్లాలో 14,258 మంది ఉపాధ్యాయులుండగా , 7,410 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు . ఇందులో 2,164 మంది కచ్చితంగా బదిలీ కావా ల్సిన వారు ఉండగా , తక్కిన 5,246 మంది రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు . 1 , 102 మంది స్పౌజ్ కోటాలో దరఖాస్తు చేసుకోగా .. 840 దరఖాస్తులు నిబంధనలకు విరుద్ధంగా స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం . 

కళ్లుమూసుకుని అప్లోడ్ చేసిన MEO లు బదిలీ దరఖాస్తుకు సంబంధించి స్పాజ్ , ప్రిఫరెన్షి యల్ కేటగిరీకి సంబంధించిన వివరాలను ఎం ఈఓ , ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలి . కానీ చాలా మంది ఎంఈఓ , ప్రధానోపాధ్యాయులు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓ 54 , 55 పూర్తిగా పరిశీలించకుండా స్పౌజ్ కోటాకు ఆమోదం తెలి పారు . స్పౌజ్ కోటా దక్కిన వారు అదనంగా 5 పాయింట్లు పొందుతారు . ఒక పాయింట్ అధికంగా వస్తేనే కేటగిరీ -8 నుంచి కేటగిరీ -2 లోకి వచ్చిన సం దర్భాలు అనేకం . ఇలాంటిది 5 పాయింట్లు అనర్హు లకు దక్కితే - అర్హులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది . 

స్పౌజ్ లీలలెన్నో

 కేజీబీవీల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు , ఎస్ బీఐ లైఫ్ ఇస్రూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్ట్ అసిస్టెంట్లు , రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు , సీఆర్టీ , హెల్త్ , ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పాజ్ కేటగిరీ కింద రారు . కానీ చాలా మంది ఉపాధ్యా యులు తమ జీవితభాగస్వామిని ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ఉద్యోగిగా చూపి స్పాజ్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నారు . వీటిని వెనక్కి పంపాల్సిన ప్రధానోపాధ్యాయులు , ఎంఈఓలు అవగాహనా రాహిత్యంతో ఆమోదముద్ర వేశారు . మరోవైపు స్పౌజ్ కేటగిరీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సిన అవ సరం లేకపోవడంతో స్పౌజ్ పేరుతో వందల మం ది దరఖాస్తు చేసి ఆమోదం పొందారు . దీంతో వీరికంటే పదేళ్ల సీనియర్లను దాటుకుని సీనియార్టీ - జాబితాలో ముందుకు రావడం గమనార్హం 

NR లను పరిశీలిన చేయాలి 

వాస్తవానికి స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకున్న వారి - సర్వీసు రిజిష్టర్ ( ఎస్.ఆర్ ) తో పాటు వారి జీవిత భాగస్వామి ఎస్ఆర్ కూడా విధిగా పరిశీలించాలి . దరఖాస్తుదారుడి సర్వీసు రిజిష్టర్ లో ఆమోద 7 ముద్ర వేయాలి . గత 8 సంవత్సరాల్లో ఎన్ని 5 దఫాలు స్పౌజ్ వినియోగించారో కూడా సర్వీసు రిజిస్టర్లను చూస్తే తెలిసిపోతుంది . కానీ ఇవేమీ పట్టించుకోకుండానే సీనియార్టీ జాబితా ప్రకటిస్తు - న్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి . వెబ్ కౌన్సె లింగ్ జరిగితే స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసు ఆ కున్న అనర్హుడు లబ్ది పొందే ప్రమాదం ఉంది . ఈ క్రమంలో వెబ్ కౌన్సెలింగ్ జరగక ముందే స్పౌజ్ 5 కేటగిరీ దరఖాస్తులు , సర్వీసు రిజిష్టర్లను జిల్లా స్థాయిలో పరిశీలించాలని , లేకపోతే స్పౌజ్ కింద అక్రమంగా దరఖాస్తు చేసిన 340 మంది 5 పాయింట్లు అదనంగా పొంది .. మంచి స్థానాలు దక్కించుకుంటే అర్హులైన ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది .



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Transfers 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0