Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know how much we spend on American education?

అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?

Do you know how much we spend on American education?

అమెరికాలో ఉన్నత విద్య అంటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో క్రేజ్‌. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనుకాడటం లేదు. 2019-20లో అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏకంగా 7.60 బిలియన్‌ డాలర్లు వెచ్చించడం విశేషం. ఆ దేశంలో అత్యధికంగా చదువుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో గత ఐదేళ్లతో పోలిస్తే 2019-20లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు 4.40 శాతం తగ్గారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21కి ముందస్తు దరఖాస్తులు దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ఈ మేరకు అమెరికా స్టేట్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

27 టాప్‌ యూనివర్సిటీల వైపే భారతీయుల మొగ్గు 

  • అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 1,93,124 మంది భారతీయ విద్యార్థులే. సంఖ్యాపరంగా విదేశీ విద్యార్థుల్లో చైనీయులు మొదటి స్థానం (3.72 లక్షల మంది)లో ఉన్నారు.
  • భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెడిసిన్‌, మ్యాథ్స్‌ కోర్సుల్లో ఎంఎస్‌, పీహెచ్‌డీ చేస్తున్నారు. 
  • అమెరికాలో మొత్తం 74 యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది 27 టాప్‌ యూనివర్సిటీల్లోనే చేరారు.  
  • కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, మసాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఓహియో, మిచిగాన్‌, ఇండియానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 
  • మన దేశీయులు అత్యధికంగా చేరుతున్నవాటిలో న్యూయార్క్‌ యూనివర్సిటీ, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ (బోస్టన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌
  • ఇల్లినాయిస్‌, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (లాస్‌ఏంజెల్స్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (శాండియాగో), పర్డు‍్య యూనివర్సిటీ, బోస్టన్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.
  • 2019-20లో అమెరికాలో మొత్తం 10.75 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యాభాస్యం చేశారు. ఆ దేశంలో మొత్తం విద్యార్థుల్లో విదేశీ విద్యార్థుల వాటా 5.50 శాతం. వీరు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 44 బిలియన్‌ డాలర్లు సమకూర్చారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know how much we spend on American education?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0