Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confirmation that 14 students were sent to other schools

ఇదేం పని మాస్టారూ..!

Confirmation that 14 students were sent to other schools

  • 14 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపినట్లు నిర్ధారణ
  • రేషనలైజేషన్‌పై ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన డీఈవో గంగాభవాన

హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఉపాధ్యాయ పోస్టులకు కోతపడకుండా చూసుకోటానికి విద్యాశాఖ యంత్రాంగం అడ్డదారులు తొక్కుతోంది. తల్లిదండ్రుల ధ్రువీకరణ లేకుండానే పిల్లలను ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ఇష్టానుసారం టీసీలు ఇచ్చి పంపుతున్నారు. ఇష్టానుసారం సర్దుబాటు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా కొందరు ఉపాధ్యాయులే సోమవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమయ్యింది.

ప్రధానంగా ఉన్న ఊళ్లో చదివితేనే అమ్మఒడి సాయం అందుతుందని, జగనన్న విద్యాకానుక కిట్లు వస్తాయని పిల్లలను నమ్మబలికి ఆ మేరకు వేరే పాఠశాలల నుంచి బలవంతంగా వెనక్కి పిలిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల అదనంగా ఉన్న పిల్లలను తాత్కాలింగా పంపాలని, బదిలీలు ముగియగానే పంపిచేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు.

తాడికొండ, ప్రత్తిపాడు, బెల్లంకొండ మండలాల్లో ప్రస్తుతం ఈ రకమైన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయని ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం రాత్రి డీఈఓ గంగాభవానీని కలిసి కోరారు. తాడికొండ మండలం లాం ఎంపీపీ పాఠశాల నుంచి 14 మంది విద్యార్థులను తాతిరెడ్డిపాలెం, పణిధరం పాఠశాలలకు సర్దుబాటు చేసినట్లు బసవలింగారావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ పాఠశాల నుంచి తమకు తెలియకుండానే పిల్లలను వేరే పాఠశాలలకు పంపారని, ఇది సరికాదని లాం ఎంపీపీ పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు డీఈఓ గంగాభవానీ, ఆర్జేడీ రవీంద్రనాధరెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల పేర్లను కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చూపించారని చెబుతున్నారు. సహకరించకపోతే పాఠశాలను మూసివేయిస్తామని విద్యాశాఖ అధికారులు బెదిరించినట్లు సమాచారం. వాస్తవంగా హేతుబద్ధీకరణ నిర్వహణకు నవంబరు 3వ తేదీ వరకు ఛైల్డు ఇన్‌ఫోలో ఉన్న సమాచారం ఆధారంగానే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఇప్పటికే సర్దుబాటు చేశారు. అసలు పాఠశాలల్లో ఆమేరకు పిల్లలు ఉన్నారా లేదా అని పరిశీలించటానికి ఎవరైనా ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తారేమోనని భయపడి కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులను ప్రస్తుతానికి పిల్లలను సైతం పంపాలని కోరుతున్నారు. దీంతో పిల్లలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపటానికి కొందరు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confirmation that 14 students were sent to other schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0