Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Fear of school

 బడి భయం  • నేటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు
  • 9, 10, ఇంటర్‌, డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభం
  • ఒక పూటే నిర్వహణ.. గదికి 16 మంది మాత్రమే
  • ఇప్పటికే టీచర్లు, విద్యార్థుల్లో రెండు శాతం మందికి కరోనా


ఓ వైపు రోజూ వందలాది కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. మరోవైపు శీతాకాలంలో సెకండ్‌ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ సహా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనల మధ్య సోమవారం నుంచి తెరుచుకోనున్న 9, 10, సీనియర్‌ ఇంటర్‌, డిగ్రీ, పీజీ తరగతులకు తమ పిల్లలను పంపడంపై తల్లిదండ్రుల్లో ఒకింత సందిగ్ధత నెలకొంది. 


జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి బాల బాలికలకు నిర్వహిస్తోన్న ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలపై సందేహాల నివృత్తికి కొందరు విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠ శాలలకు ఇప్పటికే హాజరవుతున్నారు. ఇలా పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తోపాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విద్యార్థులకు పాఠశాలల ప్రాంగణా ల్లోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియమించిన ప్రత్యేక వైద్య బృందాలతో అక్టోబర్‌ రెండో వారం నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటి వరకూ 60 వేల మంది విద్యార్థులకు, టీచర్లలో 50 శాతం మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రెండు శాతం మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ మేరకు పాజిటివ్‌ నిర్ధారణ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించి కరోనా సోకిన వారిని హోం ఐసొలేషన్‌ లోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇదే పరిస్థితి టీచర్లలోనూ ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి క్లాసులో సగం మంది విద్యార్థులు హాజరైతే వారిని గుమిగూడ కుండా పర్యవేక్షించడం కష్టతరం అవుతుందని, అదే జరిగితే కొవిడ్‌ వ్యాప్తికి దారి తీయవచ్చునన్న భయాందోళనలు నెలకొన్నాయి.  

విద్యా సంస్థలు, తరగతుల నిర్వహణకు పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌ఒపీ)ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకా రం నిత్యం స్కూలు/కళాశాల ప్రాంగణాలు, తరగతి గదులను శానిటైజ్‌ చేయాలి. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేసేందుకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ గన్‌ల ను అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బంది సేవలను తీసుకోవాలి. తాగునీరు, మధ్యాహ్నం భోజన సమయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతర ప్రాంతాల నుంచి రవాణా వాహనాల్లో ప్రయాణించి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ఈ క్రమంలో ముఖ్యంగా పాఠశాల ప్రాంగ ణాలు, తరగతి గదులను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో పిచికారీ చేయా లంటే ఐదు లీటర్ల లిక్విడ్‌ ఖరీదు రూ.1,200 నుంచి రూ.2,200 వరకూ ఉంది. ఐదు లీటర్ల శానిటైజర్‌ క్యాన్‌ ఖరీదు రూ.1,500 వరకూ వెచ్చించాల్సి ఉంటుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వీటిని పిచికారీ చేసిన తరువాత తరగతుల నిర్వహణకు కనీసం ఆరు గంటలు ఉండాలి. ముందు రోజు సాయంత్రమే పిచికారీ చేయాలి. ఐదు లీటర్ల పరిమాణం గల టిన్‌ రెండు, మూడు రోజుల్లోనే అయి పోతుంది. థర్మల్‌ స్ర్కీనింగ్‌ గన్‌లు వంటి పరికరాలను, ద్రావణాలను స్కూ లు కాంపోజిట్‌ గ్రాంటు నిధుల నుంచి కొను గోలు చేసుకోవాలని విద్యా శాఖ అధికారులు సూచి స్తున్నారు. కొవిడ్‌ నివారణ చర్యలకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని, వాస్త వానికి ఈ నిధులు విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, తదితర నిర్వహణ ఖర్చులకు నిర్ధేశించినవని హెచ్‌ఎంలు చెబుతున్నారు.ఆ ప్రకారం విద్యాసంస్థలు తెరుచు కుంటున్నా కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు విడుదలపై విద్యాశాఖ ఇంతవరకూ నిధులు వెచ్చించలేదు. గ్రామీణ ప్రాంతా ల్లో 20 నుంచి 40 శాతం మంది విద్యార్థులు, పట్టణ ప్రాంతాల్లో కేవలం 10 శాతం మందిలోపు విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

భోజన పథకం నిర్వహణా కష్టమే

మధ్యాహ్న భోజనం పెట్టిన తరువాత విద్యార్థులను ఇళ్లకు పంపిస్తారు. ఆ మేరకు భోజన పదార్థాలు వండే కార్మికులు చేతికి గ్లౌజ్‌, తలకు క్యాప్‌లు, మాస్క్‌లు విధిగా ధరించాలి. భోజనం చేసేటప్పుడు విద్యార్థులు ఒకేచోట కూర్చోకుండా చూడాలి. పలు మండలాల్లో భోజన పథకం అమలు బాధ్యతలను తీసుకున్న ఏక్తా శక్తి పౌండేషన్‌ నిర్వాహకులు ఈనెల 23వ తేదీ వరకూ భోజన పదార్థాలను సరఫరా చేయలేమని తేల్చి చెప్పడం గమనార్హం. దీంతో ఎక్కడికక్కడ తాత్కాలిక ప్రాతిపదికన స్థానిక పాఠశాలల్లోని వంట తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు. 

టాయిలెట్లు, తాగునీరు కరువే

తొలిదశ నాడు – నేడు పనులు జిల్లాలోని 284 హైస్కూళ్లల్లో ఇప్పటికి పూర్తి కాలేదు. ప్రధానంగా టాయిలెట్లు, తాగునీటి సరఫరా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తరగతి గదుల్లో ఫ్లోరింగ్‌ పనులు పూర్తయినా, విద్యుదీకరణ స్విచ్‌బోర్డు పనులు జరుగుతున్నాయి. ఆ ప్రకారం హైస్కూళ్లలో 9,10 తరగతులకు కొవిడ్‌ నిబంధనల ప్రకారం గదుల కొరత ఉండకపోవచ్చు. కాని, నాడు –నేడు పనుల పూర్తికి ఈ నెలాఖరు వరకూ గడువు ఉన్నందున పలు పాఠశాలల్లో కనీస వసతులకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. 

సెకండ్ వేవ్‌ భయం

రెండో దఫా కరోనా వస్తుందన్న భయం మొదలైంది. రాష్ట్రంలో కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాఠశాలలు ప్రారంభం ఏ మాత్రం మంచిది కాదు. ఒక విద్యార్థికి సోకితే కుటుంబమంతా పాకుతుంది. తోటి విద్యార్థులకు ఇబ్బంది. దీనిని పరిగణనలోకి తీసుకుని కరోనా ఉధృతి పూర్తిగా తగ్గేవరకు పాఠశాలలు తెరవకూడదు. 

బ్రహ్మానందం, రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు, భీమవరం

ఈ పరిస్థితుల్లో స్కూల్‌కు పంపలేం

ఇంటి నుంచి బయటకు వెళ్లి రావడానికి భయపడాల్సి వస్తోంది. అలాంటప్పుడు కళాశాలకు విద్యార్థులను పంపించడం కష్టం. వాక్సిన్‌ వచ్చి కరోనా ఉధృతి తగ్గాలి. అప్పుడే కళాశాలలకు పిల్లలు వెళ్లినా భయం ఉండదు. ఈ నెలలో పాఠశాలలు తెరిచినా పిల్లలను పంపలేం. కరోనాకు ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిందే. విద్యార్థులు అందరూ ఒకే రూమ్‌లో కూర్చోవడం ఇబ్బందే.

 విద్యార్థి తండ్రి, భీమవరం

పాఠశాలకు పంపాలంటే.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో సుమారు ఏడు నెలలుగా పాఠశాలలు మూతపడి ఉన్నాయి. ఇంకా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో పిల్లలను పాఠశాలకు పంపడం భయంగానే ఉంది. మా అమ్మాయి ఈ ఏడాది పదో తరగతిలోకి వచ్చింది. సోమవారం నుంచి బడికి పంపాలో వద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. పదో తరగతి ఎంత ముఖ్యమో.. పిల్లల ఆరోగ్యం అంతకంటే ముఖ్యం కదా. ప్రభుత్వ పాఠశాలలు తెరుస్తున్న ప్పటికీ మరికొద్ది రోజులు వేచి చూసిన తర్వాత పంపిస్తాం.

సత్యనారాయణమూర్తి, నిడదవోలు  

ప్రభుత్వానిదే బాధ్యత

కరోనా వల్ల నష్టం జరిగింది. ఆరు నెలలు ఎలాగో కోల్పోయాం. మరో నాల్గు నెలలు ఆగితే మంచిది. విద్యాశాఖకు సంబంధం లేకుండా తల్లిదండ్రులతో సమ్మతిపత్రం తీసుకురమ్మనే బదులు పాఠశాలలు తీయకుండా ఉంటే మంచిది కదా. కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ పాఠశాలలు తీయవద్దు అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం తెరవాలంటుంది. విద్యార్థులకు ఏం జరిగినా బాధ్యత ప్రభుత్వానిదే.


–ఆర్షియా ఫర్హన్‌, ఆకివీడు

మరో 2 నెలలు ఆగితే బాగుండును

కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో పాఠశాలలు తెరవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనాతో ఎంతో మంది మృతి చెందారు. ఎంత కట్టుదిట్టం చేసినా ప్రమాదం నియంత్రించలేమని ఆందోళన చెందుతున్నాం.

– కొండల్‌, ఉపాధ్యాయుడు, ఆకివీడు

పిల్లల జీవితాలతో ఆటలా..?

కరోనావ్యాప్తి సమయంలో పాఠశాలలు తెరచి పిల్లలు జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదు. ప్రస్తుతం వైరస్‌ సెకండ్‌ వేవ్‌ అధికంగా ఉండ టంతో ఇతర దేశాల్లో మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు మూడు నుంచి నాలుగు వేల కేసులు నమోదవు తున్నాయి. వైరస్‌ను పూర్తిగా అరికట్టి, వ్యాక్సిన్‌ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Fear of school"

Post a Comment