Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How many types of schools .....?

స్కూళ్ళు ఎన్నిరకాలు.....?

How many types of schools .....?

  • స్కూళ్ళు ఎన్నిరకాలుగా ఉన్నాయిి
  • ఎన్నియాజమన్యాల కింద ఉన్నాయి,


ఏ సిలబస్ అనుసరిస్తున్నాయి, ఎవరికి విద్యనందిస్తున్నాయి వంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఈ కింది అంశాలు గోచరించాయి.....

1. MPP స్కూళ్ళు:అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ఏర్పడిన మండల పరిషద్ స్కూళ్ళు ఉన్నాయి. మనదేశంలో ఇవి 1927 నుండి ఉన్నాయి. ఇవి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉంటాయి.

2. ZP స్కూళ్ళు:జిల్లా పరిషద్ స్కూళ్ళలో 6-10 తరగతులు ఉంటాయి.ఇలాంటి  స్థానిక సంస్థల స్కూళ్ళు 1917 నుండి ఉన్నాయి. 

3. GHS: స్కూళ్ళు: పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళు. 

4. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ :ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత సామాజిక వర్గాల వారిగా స్కూళ్ళను ప్రత్యేకం చేశాక 35 స్కూళ్ళు ఉన్నాయి. రకరకాలైన గురుకులాలన్నికలిపి 974 ఉన్నాయి. కొన్నింటిలో ఇంటర్ విద్య కూడా ఉంది.

5. తెలంగాణ మోడల్ స్కూళ్ళు: వెనుకబడిన మండలాలలో ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ప్రభుత్వం 27 జిల్లాలలో 194 స్కూళ్ళు స్థాపించింది. ఇందులో  6-12 తరగతులు ఉంటాయి.

6. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు(TSWREI): వీటిని 1984 లోనే స్థాపించారు. 2014 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐ.పి.ఎస్. అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ళు. 268 స్కూళ్ళు పేద పిల్లలకు ముఖ్యంగా షెడ్యూలు కులాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించినవి.

7. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(TTWREIS). ఇవి గిరిజన సంక్షేమ హాస్టళ్ళు.మొత్తం 187 ఉన్నాయి.

8. మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూళ్ళు((MJPTBCWREI): వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల కోసం తెలంగాణలో 142 స్కూళ్ళు,ఏర్పాటు చేశారు.ఇందులో అయిదు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. 19 జూనియర్ కాలేజిలు ఒక డిగ్రీ కాలేజి కూడా వీటి అధ్వర్యంలో నడుస్తున్నాయి.

9. ఏకలవ్య మోడల్ రెసిడేన్షియల్ స్కూళ్ళు(TTWREIS): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో 16 స్కూళ్ళు మంజూరు చేశారు.

10. ఆశ్రమ పాటశాలలు: ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రాంతాలలో గిరిజన సంక్షేమ శాఖ వీటిని నడిపిస్తుంది.

11. కస్తుర్బా స్కూళ్ళు(KGBV): కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. భారత ప్రభుత్వం బాలికలకు12 వ తరగతి వరకు రెసిడేన్షియల్ విద్యను అందించేందుకు 2004 లో ప్రారంబించింది.75శాతం సీట్లు SC,ST,BC,Minority కుటుంబాల పిల్లలకు మిగతా 25 శాతం సెట్లు BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు.

12. నవోదయ స్కూళ్ళు: జవహర్ నవోదయ స్కూళ్ళు భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.1986 లో CBSE సిలబస్ తో 6-12 తరగతులు చదివే తెలివైన గ్రామీణ పిల్లలకు కోసం వీటిని ప్రారంబించారు.తమిళనాడు మినహా దేశంలోని ప్రతి జిల్లాలో ఉండేలా 636 స్కూళ్ళు స్థాపించారు.

13. సైనిక్ స్కూళ్ళు: 1961లో రక్షణ శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.వి.కే. కృష్ణ మీనన్ వీటి రూపకర్త.దేశంలో 33 స్కూళ్ళు ఉన్నాయి.రక్షణ సేవలో నాయకులను తయారు చేయడానికి విద్యార్థులను సన్నద్దులను చేయడం వీటి ప్రధాన లక్ష్యం. 

14. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు(TMREIS): తెలంగాణ లోని 31జిల్లాలలో 203 స్కూళ్ళు మంజూరు చేశారు. ఇందులో 75శాతం సీట్లు ముస్లిం మైనారిటిలకుమిగతా 25శాతం BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు. వీటిలో 12 వ తరగతి వరకు కూడా అవకాశం ఉంది.

15. ఎయిడెడ్ స్కూళ్ళు: ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతూ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు.

16. అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు: పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు. ఇందులో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళు,కార్పోరేట్ స్కూళ్ళు,చారిటి సంస్థల అధ్వర్యంలో నడిచే స్కూళ్ళు ఉంటాయి.

17. ఇంటర్నేషనల్ స్కూళ్ళు: ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే డే స్కూళ్ళు.

18. బోర్డింగ్ స్కూళ్ళు: ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్ళు.

19. సింగరేణి స్కూళ్ళు: సింగరేణి కాలరీస్ ఎడుకేషనల్ సొసైటి అధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు. తొమ్మిది స్కూళ్ళు, ఒక డిగ్రీ కాలేజీ,ఒక జూనియర్ కాలేజీ,ఒక పాలిటెక్నిక్ కాలేజీలుఉన్నాయి.

20. రైల్వే స్కూళ్ళు: భారత రైల్వే శాఖ 1873లోనే స్కూళ్ళు ప్రారంబించింది. చాలాకాలం ఇవి బాగా నడిచాయి. అయితే ప్రతి క్లాసుకు 15-20 రైల్వే ఉద్యోగుల పిల్లలు లేకపోతే స్కూళ్ళు రద్దు చేస్తామని దక్షిణ మద్య 2018లో రైల్వే ప్రకటించింది.

21. ఆర్మీ స్కూళ్ళు: కంటోన్మెంట్ ఏరియాలలో 1974లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళు స్థాపించారు.ఆర్మీ వెల్ఫేర్ ఎడుకేషన్ సొసైటి పేరుతో రక్షణ శాఖ వీటిని నడిపిస్తుంది.ఇవి CBSE సిలబస్ అనుసరిస్తాయి.

22. ఎయిర్ ఫోర్స్ స్కూళ్ళు: వీటిని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ స్కూల్స్ అంటారు.వాయుసేన సిబ్బంది పిల్లల కోసం వీటిని స్థాపించారు.1955 నుండి రక్షణ శాఖ CBSE సిలబస్ తో నడిపిస్తున్నది.యూ.కే.జి.నుండి 12వ తగరగతి వరకు విద్యను అందిస్తారు.

23. నేవీ స్కూళ్ళు: నేవీ ఎడుకేషన్ సొసైటి నేవీ చిల్ద్రెన్ స్కూల్స్ పేరిట వీటిని 1965 నుండి CBSE సిలబస్ తో నడిపిస్తున్నది. విశాఖపట్నం లో ఒక స్కూల్ ఉంది.

24. ఆటమిక్ఎనర్జీ స్కూళ్ళు: ఆటమిక్ ఎనర్జీ ఎడుకేషన్ సొసైటి అధ్వర్యంలో దేశంలోని 16 ప్రాంతాలలో 30 స్కూళ్ళు నడుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, మణుగూరులలో ఈ స్కూళ్ళు ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జిలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం ఈ స్కూళ్ళు స్థాపించారు.

25. కేంద్రీయ విద్యాలయాలు:భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ 1963లో వీటిని ప్రారంబించింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా 1243 స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో ఒకటి నుండి 12 తరగతి వరకు అవకాశం ఉంది.

26. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు: వివిధ రకాలైన క్రైస్తవమిషనరీల అధ్వర్యంలో దేశంలో స్కూళ్ళు స్థాపించారు.

27. ఇస్లామిక్ మదర్సాలు:ఇస్లామిక్ సంస్కృతి బోధించడానికి ఉద్దేశించినవి. వ్యాకరణం,గణితం,కవిత్వం, చరిత్ర అన్నింటికీ మించి ఖురాన్ నేర్పిస్తారు.ఎలిమెంటరి స్కూల్ ను మక్తబ్ అని సెకండరి స్కూల్ ను మదర్సా అంటారు.మన దేశంలో వారం హేస్టింగ్స్ సమయంలో కలకత్తాలో మొదట స్థాపించారు.

28. గురుద్వార స్కూళ్ళు:సిక్కుల ఆచార సంప్రదాయాల పరిరక్షణకు ఖల్సా కొన్ని విద్యా  సంస్థలను స్థాపించింది. సిక్కుమత నియమనిభందనలను పాటించేలా చూస్తాయి. ఇతర దేశాలలో కూడా ఖల్సా విద్యా సంస్థలు ఉన్నాయి.

29. శిశుమందిర్ స్కూళ్ళు:1952లో నానాజీ దేశ్ముఖ్ మొదటి స్కూలును గోరక్ పూర్ లో స్థాపించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిర్ ల పేరిట స్కూళ్ళను రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ నడిపిస్తున్నది.

30. వేద పాటశాలలు: సాంప్రదాయ గురుకుల పద్ధతిలో వేద అధ్యయనం కోసం వీటిని స్థాపించారు. యోగ,ధ్యానం,వేదపటనం , గణితం,సేవ నేర్చుకుంటారు.

31. ప్రత్యేక బోధనా పద్ధతుల స్కూళ్ళు: మాంటిస్సొరి,జెనాప్లాన్,డాల్టన్ వంటి పద్ధతులు అనుసరిస్తూ బోధించే స్కూళ్ళు. సాదారణంగా వాటి పేర్లతోనే వాటి స్వభావం తెల్సిపోతుంది.

32. స్పెషల్ స్కూళ్ళు: వివిధ లోపాలున్న పిల్లలకు విద్యను అందించే స్కూళ్ళు. చెవిటి-మూగ,ఎపిలెప్సి,ఆటిజం, ADHD వంటి ఇబ్బందులు ఉన్న వారికి ప్రత్యేక స్కూళ్ళు ఉన్నాయి.

33. అంధుల పాటశాలలు:  బ్రెయిలీ లిపిలో విద్యను అందించే స్కూళ్ళు.

34. ఓపెన్ స్కూళ్ళు: ఇంటివద్దనే ఉండి పరీక్షలు రాసుకునే అవకాశం గల స్కూళ్ళు.

35. స్పోర్ట్స్ స్కూళ్ళు: చదువుతో పాటు ఆటలు నేర్పించే స్కూళ్ళు.

36. అనాథ పాటశాలలు :ప్రభుత్వం మరియు స్వచ్చంద సంస్థలు కొన్ని అనాథ పాటశాలలు నడిపిస్తున్నాయి.

37. అంగన్ వాడి స్కూళ్ళు: గ్రామీణ పేద పిల్లల ఆకలి తీర్చి వారికి పౌష్టిక ఆహరం అందించడానికి 1975లో భారత ప్రభుత్వం ICDS కార్యక్రమం చేపట్టింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తుంది.తెలంగాణలో 35,700 అంగన్వాడి కేంద్రాలున్నాయి.

38. ప్రి స్కూళ్ళు/ప్లే స్కూళ్ళు:స్కాట్లాండ్ లో రాబర్ట్ ఓవెన్ 1816లో మొదటి ప్రి స్కూల్ స్థాపించారు.ప్రి-ప్రైమరీ, నర్సరీ,డే కేర్,కిండర్ గార్టెన్ అని వివిధ పేర్లతో వీటిని పిలుస్తున్నారు. మనదేశంలో 30శాతం గొలుసుకట్టు ప్రి స్కూల్లే ఉన్నాయి.

39. ప్రైమరీ స్కూళ్ళు: ఒకటి నుండి అయిదు తరగతుల వరకు ఉండేవి.

40. అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు: ఒకటి నుండి ఏడు తరగతుల వరకు ఉండేవి.

41. హై స్కూళ్ళు/సెకండరి స్కూళ్ళు:పదవ తరగతి వరకు ఉండేవి.

42. హయ్యర్ సెకండరి/సీనియర్ సెకండరీ స్కూళ్ళు: 12 తరగతి వరకు ఉండేవి.

43. బాలుర స్కూళ్ళు:

44. బాలికల స్కూళ్ళు:

45. కో-ఎడ్యుకేషన్ స్కూళ్ళు:

46. డే స్కూళ్ళు: 

47. రెసిడెన్షియల్ స్కూళ్ళు:

48. సెమి-రెసిడెన్షియల్ స్కూళ్ళు:

49. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు:

50. తెలుగు మీడియం స్కూళ్ళు:

51. ఉర్దూ మీడియం స్కూళ్ళు:

52. సంస్కృత స్కూళ్ళు:

53. స్టేట్ సిలబస్ స్కూళ్ళు: Board of Secondary Education (BSE)సిలబస్ అనుసరించేవి.

54. సెంట్రల్ సిలబస్ స్కూళ్ళు: Central Board of Secondary Education (CBSE), Indian Certificate of Secondary Education (ICSE) సిలబస్ అనుసరించేవి.

55. ఇంటర్నేషనల్ సిలబస్ స్కూళ్ళు:International General Certificate of Secondary Education (IGCSE), international Baccalaureate (IB) సిలబస్ అనుసరించేవి.

ఇంకా ఏమైనా స్కూళ్ళు ఉంటే దయచేసి కామెంట్ చెయ్యండి.అలాగే డబుల్ ఎంట్రీ అయినవి,రద్దు అయినవి,మెర్జ్ అయినవి ఉంటే కూడా తెలియజేయండి.

భారత సమాజంలో వివిధ దొంతరలు ఉన్నట్లుగానే వివిధ రకాలైన విద్యా సంస్థలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు బహురూప విద్యా సంస్థలు ఉండటమా లేక ఏకరూప విద్యా సంస్థలు ఉండటమా అనేది ఆలోచించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "How many types of schools .....?"

  1. OC లో కూడా చాలా మంది భీదవారు వున్నారు,వీరికి కూడా మిగతా కమ్యూనిటివారిలాగా Governament Residential Schools అవసరం.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0