If you do not want to delete Gmail account ..!
జీమెయిల్ ఖాతా తొలగించకుండా ఉండాలంటే..!
ఇంటర్నెట్ డెస్క్: సెర్చ్ ఇంజిన్ GOOGLE వినియోగదారుల ఖాతాల నిర్వహణకు సంబంధించి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు ఏళ్లుగా వినియోగంలో లేని జీమెయిల్ ఖాతాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఇది జీమెయిల్‌తో పాటు GOOGLE ఇతర సర్వీసులైన డాక్స్, షీట్స్, ఫొటోస్, డ్రాయింగ్స్, డ్రైవ్‌లకు వర్తిస్తుందని తెలిపింది. అలానే రెండు ఏళ్లలో స్టోరేజ్ లిమిట్ దాటి పరిమితికి మించి ఉన్న కంటెంట్‌ను డిలీట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జూన్ 1, 2021 తర్వాత నుంచి GOOGLE ప్రొడక్ట్స్‌లో ఖాతా ఉన్నవారు రెండేళ్ల పాటు తమ ఖాతాలను నిర్వహించకుంటే వాటిలో ఉన్న యూజర్ కంటెంట్ తొలగిస్తామని ప్రకటించింది. ఈ నిబంధన సెట్టింగ్స్‌లో ఇన్-యాక్టివ్ అకౌంట్ మెనేజర్ ఫీచర్ ఎంపిక చేసుకున్న వారికి కూడా వర్తిస్తుందని తెలిపింది.
మరి GOOGLE మీ ఖాతాతో పాటు అందులోని కంటెంట్ తొలగించకుండా ఉండాలంటే మీరు తరచుగా మీ జీమెయిల్ ఖాతాను ఓపెన్ చేస్తుండాలి. అలానే మీ ఖాతాలో అవసరంలేని కంటెంట్‌ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. అంటే అనవసరమైన మెయిల్స్, ఫొటోలు, వీడియోలతో పాటు ఇతర మీడియా ఫైల్స్‌ని డిలీట్ చేస్తుండాలి. అయితే GOOGLE యూజర్ ఖాతాలోని డేటా తొలగించే ముందు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఖాతాదారులకు సమాచారం ఇస్తామని తెలిపింది. దీంతో మీకు గూగుల్ అలర్ట్ మెసేజ్ వచ్చిన వెంటనే ఖాతా ఓపెన్ చేస్తే సరిపోతుంది. అలా మీ ఖాతా డిలీట్ కాకుండా ఎంత కాలమైనా వాడుకోవచ్చు.
0 Response to "If you do not want to delete Gmail account ..!"
Post a Comment