How much of the interest paid during the moratorium period will you get back?
మారటోరియం కాలంలో చెల్లించిన వడ్డీలో మీకు ఎంత వెనక్కి వస్తుంది?
చక్రవడ్డీ కి , సాధారణ వడ్డీ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ,రుణ గ్రహీతల ఖాతాలకు తిరిగి చెల్లించనున్నారు.
- కోవిడ్-19 వ్యాప్తితో మార్చి 2020 చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడం వల్ల అనేక మంది పూర్తి లేదా
- పాక్షిక సంపాదన కోల్పోయారు. అయితే అప్పటికే అనేక మంది ఇంటి రుణం, ఆటో రుణం, క్రెడిట్ కార్డు, విద్యా రుణం ,
- సూక్ష్మ, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణాలు (MSME), వ్యక్తిగత, వృత్తిపర రుణాలు ,వినియోగ వస్తువుల
- కొనుగోలు రుణాలు వంటివి తీసుకున్నారు. ఈ రుణాలపై EMI చెల్లించడం చాలా కష్టమైంది . దీని నుంచి ఉపశమనం
- కలిగించడానికి రిజర్వు బ్యాంకు మూడు నెలలు మారటోరియం విధించింది. అంటే 29 ఫిబ్రవరి, 2020 నాటికి ఉన్న
- రుణాలను మూడు నెలలు అంటే 31 మే 2020 వరకు చెల్లించలేక పోయినా, వారి క్రెడిట్ స్కోర్ పై ఎటువంటి ప్రభావం
- చూపబోదని తెలిపింది. ఆ తరువాత మారటోరియం ను మరో మూడు నెలలు అంటే 31 ఆగష్టు ,2020 వరకు
- పొడిగించింది . కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం, చక్రవడ్డీ కి , సాధారణ వడ్డీ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ,
- రుణ గ్రహీతల ఖాతాలకు తిరిగి చెల్లించే ఏర్పాటు చేసింది.
- ఈ కింది పట్టిక ద్వారా వివిధ వడ్డీ రేట్లకు ఆరు నెలలకు ఎంత చక్రవడ్డీ, ఎంత సాధారణ వడ్డీ వర్తిస్తోందో తెలుసుకోవచ్చు.
- ఉదా : రూ. 1 లక్ష కు 8 శాతం వడ్డీతో ఆరు నెలల కాలానికి చక్రవడ్డీ రూ. 4,067 అయితే , సాధారణ వడ్డీ రూ.4,000.
- కాబట్టి తిరిగి పొందే మొత్తం రూ. 67.
- అలాగే, రూ. 10 లక్షల రుణం పై 8 శాతం వడ్డీతో ఆరు నెలల కాలానికి తిరిగి పొందే మొత్తం రూ. 673.
- అదే విధంగా రుణం రూ 10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వివిధ శాతాలలో ఎంత తిరిగి పొందొచ్చో చూపడమైనది.
- ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.
0 Response to "How much of the interest paid during the moratorium period will you get back?"
Post a Comment