Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sabarimala : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్ ... ఈ రూల్స్ మర్చిపోవద్దు

 Sabarimala : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్ ... ఈ రూల్స్ మర్చిపోవద్దు.


 


అయ్యప్ప మాల వేసి శబరిమల వెళ్తున్న భక్తులకు అలర్ట్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి అంతా మారుతోంది. భక్తుల్ని గతంలోలాగా దర్శనానికి అనుమతివ్వరు. నవంబర్ 16న శబరిమలలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్చువల్ క్యూ పద్ధతిని పాటిస్తున్నారు. వారంలో ఐదు రోజులు రోజూ 1,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం మాత్రం 2,000 చొప్పున భక్తుల్ని అనుమతిస్తారు. ఇక మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో దర్శనానికి 5,000 మంది భక్తుల్ని అనుమతిస్తారు. డిసెంబర్ వరకు క్యూ స్లాట్స్ బుక్ అయ్యాయి. నవంబర్, జనవరిలో కొన్ని స్లాట్స్ మిగిలే ఉన్నాయి. శబరిమల పండుగ సీజన్ వివరాలు చూస్తే 2020 నవంబర్ 16 నుంచి 2020 డిసెంబర్ 26 వరకు మండల పూజ, 2020 డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ, 2021 జనవరి 14న మకరవిలక్కు జరుపుకొంటారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు తాజాగా కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ 19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. అది కూడా గత 24గంటల్లో తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డు తప్పనిసరి. వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు. భక్తులదంరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. ఇక ఈసారి పంబ నదిలో స్నానాలకు అనుమతి లేదు. భక్తులకు స్నానాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు పంబలో ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేస్తోంది. పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదు. నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయి. స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్‌కు అనుమతి ఉంది. సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. భక్తులను పంబకు తీసుకెళ్లి తిరిగి నీలక్కల్‌కు తీసుకొచ్చేందుకు లైట్ మోటార్ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి.ప్రస్తుతం రోజూ 1,000 మంది భక్తులకు, వీకెండ్‌లో 2,000 మంది భక్తులకు అనుమతి లభిస్తుంది. అయితే రోజూ కనీసం 3,000 మంది, శని,ఆదివారాల్లో 5,000 భక్తులకు అనుమతి ఇవ్వాలని శబరిమల అయ్యప్ప సేవా సమాజం ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డును కోరింది. శబరిమల వెళ్లే భక్తులు https://sabarimalaonline.org/ వర్చువల్ క్యూ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్టర్ చేసుకునేవారికే దర్శనానికి అనుమతి లభిస్తుంది. 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లు దాటినవారికి అనుమతి లేదు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దర్శనానికి అప్లై చేయకూడదు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sabarimala : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్ ... ఈ రూల్స్ మర్చిపోవద్దు"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0