Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Things to know before investing in mutual funds

 మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసేముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు


ఏదైనా ఒక ఫండ్ ను ఎంపిక చేసుకునే ముందు మ‌దుప‌ర్లు దానికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను అర్థం చేసుకోవాలి.

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు మ‌దుప‌ర్లు వాటి గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి. ఫండ్ ఆఫర్‌ డాక్యుమెంట్‌ను చ‌ద‌వ‌డం ద్వారా ఈ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

1.పెట్టుబడి లక్ష్యాలు: ఫ‌ండ్ ఆఫ‌ర్ డాక్యుమెంట్లులో ఫండ్‌ లక్ష్యాలను తెలియ‌జేస్తారు. దీర్ఘకాలం పాటు పెట్టుబడి సొమ్ము పెరిగే లక్ష్యంతో గ్రోత్‌ ఫండ్‌ పనిచేస్తుంది. పెట్టుబడికి పూర్తి భరోసా, క్రమమైన ఆదాయ వనరును ఉత్పత్తిచేసే లక్ష్యం దిశగా ఇన్‌కమ్‌ ఫండ్లు కొనసాగుతాయి. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు ఆదాయ వనరుగా, పెట్టుబడికి భరోసానిచ్చే రెండు లక్ష్యాలతో పనిచేస్తాయి. ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టేముందు పెట్టుబడి లక్ష్యాలు ఫండ్‌ పెట్టుబడి లక్ష్యంతో సరి పోలుతుందో లేదో చూసుకోవాలి.

2.పెట్టుబడి వ్యూహాలు: సరైన వ్యూహంతో పెట్టుబ‌డి ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాలి. పెట్టుబడికి రక్షణనిచ్చే వ్యూహంతో ఉంటే త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే ఫండ్ల‌ను ఎంచుకోవాలి. కొంత న‌ష్ట‌భ‌యం ఉన్నా దీర్ఘ‌కాలంలో రాబడి పొందేందుకు వృద్ధి సాధ్యమయ్యే కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఫండ్ల‌ను ఎంచుకునే వ్యూహంతో ఉండాలి. ఏదైనా ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ముందు అది మనకు సరిపోతుందో లేదో చూసుకోవాలి.

3.నష్టాన్ని తట్టుకోగల శక్తి: పెట్టుబడి పెట్టాక ఏయే రకాల నష్టాలుంటాయి. వాటిని ఎదుర్కొనే అంశాలపై అవగాహన ఉండాలి. ఫండ్‌ నియమనిబంధనల్లో మార్పులు, వడ్డీ రేట్లలో మార్పు, మార్కెట్‌ స్థితిగతుల్లో కదలికలు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తదితరాలు పెట్టుబడికి ఒడిదుడుకులు కలిగించే అంశాలు. ఇదే కాక ఫండ్‌ మేనేజర్‌ వ్యూహాలు, క్లోజ్‌ ఎండెడ్‌ పథకాల్లోనైతే నిష్క్రమణ తేదీ పెట్టుబడి పై ప్రభావం చూపే అంశాలు . నష్టాన్ని తట్టుకునే శక్తిని బట్టి పెట్టుబడిదారు సదరు పథకంలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోగలగాలి.

4.రుసుములు, ఇతర ఖర్చులు: ప్రారంభ పెట్టుబడి, నిర్వ‌హ‌ణ‌కు, వార్షిక రుసుములు, ఒక వేళ మధ్యలో పెట్టుబడి ఉపసంహరించుకుంటే విధించే చార్జీలు లాంటివి ముందే తెలుసుకొని ఉండడం మంచిది. పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అయ్యే ఇతర ఖర్చులు పోను ఎంత రాబడి వస్తుందనే విషయమై అవగాహన ఉండాలి.

5.గత పనితీరు: గత పనితీరు భవిష్యత్తు పనితీరుకు కొలమానం కాదు అని ఆఫర్‌ నివేదికలో ఓ వ్యాఖ్య మనకు కనిపిస్తుంది. అయితే ఫండ్‌ గత పనితీరును అర్థంచేసుకుంటే మార్కెట్‌ పరిస్థితికి ఫండ్‌ అనుకూలతను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రమాణాలకు తగ్గట్టు, ఇతర ఫండ్‌లతో సాటిగా మనం పెట్టుబడి పెట్టిన ఫండ్‌ పనిచేస్తుందో లేదో పరిశీలించవచ్చు.

6.ఫండ్‌ మేనేజ్‌మెంట్‌: అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లో ఓ ఫండ్‌ను సమర్థవంతంగా నడిపించగలిగిన మేనేజర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. ఫండ్‌ మేనేజర్‌ నిర్వహించే ఫండ్‌ను ఇతర ఫండ్లతోనూ, అదే కోవకు చెందిన ఇతర ఫండ్ ల రాబడులతో పోల్చిచూడాలి.

7.దైనా పథకానికి వర్తించే పన్ను మినహాయింపులను తెలుసుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడి లాభాలపై ఈక్విటీల్లో పన్ను మినహాయింపు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పధకాలలో పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ వివరాల గురించి పూర్తి అవగాహన ఉంటే పెట్టుబడి నిర్ణయాలను మరింత సమర్ధవంతంగా తీసుకోవచ్చు.

8.సమస్యల పరిష్కారానికి:పెట్టుబడిదారుకు వచ్చే సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు అధీకృత వ్యక్తి లేదా సంస్థ వివరాలు ముందే తెలుసుకొని ఉండడం మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Things to know before investing in mutual funds"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0