Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

School and College fees reduction (30%) - Education Regulatory and Monitoring Commission Decided

 స్కూళ్లు, కాలేజీ ఫీజుల్లో 30 శాతం తగ్గింపు -కోవిడ్ నేపథ్యంలో పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయం.

School and College fees reduction (30%) - Education Regulatory and Monitoring Commission Decided

విద్యాసంస్థల నిర్వహణ ఖర్చులను అనుసరించి ప్రాంతాల వారీగా 2021-22 సంవత్సరానికి ఫీజుల.

కోర్టు తీర్పు ప్రకారం కసరత్తు..

రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది ఫీజులనే ప్రామాణికంగా తీసుకుని.. అందులో 30 శాతం తగ్గిస్తూ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించింది. కొత్త ఫీజుల నిర్ణయానికి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫీజులనే వసూలు చేసేలా కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో కోవిడ్ కారణంగా దాదాపు 7 నెలల పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల నిర్వహణ ఖర్పులు లేకపోవడం, విద్యార్థులకు బోధన కూడా లేనందున గత ఏడాది ఫీజులో 30 శాతం తగ్గించింది. ఆ మేరకు మాత్రమే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పును అనుసరించి, ఆపై కమిషన్ తీసుకునే తదుపరి చర్యల ప్రకారం ఫీజులపై తుది నిర్ణయం ఉంటుందని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు పేర్కొన్నారు.

ప్రాంతాలు, ఖర్చులను బట్టి ఫీజులు.

ఈ ఏడాది ఫీజులపై నిర్ణయం తీసుకోవడానికి పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నది. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు దానిపై కోర్టును ఆశ్రయించాయి. ఆయా విద్యాసంస్థల వివరాలను నిర్ణిత పోర్టల్లో అప్లోడ్ చేయాలని కమిషన్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. స్కూల్ భవనాలు తరగతులు, సెక్షన్లు, ప్రస్తుత విద్యార్థుల సంఖ్య, వారి మంచి వసూలు చేస్తున్న ఫీజులు, టీచర్లు, వారికిచ్చే వేతనాలు, ఇతర ఖర్చులకు సంబంధించిన అంశాలను సమర్పించాలని విద్యాసంస్థల యాజమాన్యాలను కమిషన్ కోరింది. వాటి ఆధారంగా ఆయా స్కూళ్లను ర్యాండమ్ గా తనిఖీ చేసి యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫీజులు నిర్ణయించాలని భావించింది. విద్యాసంస్థ ఉన్న ప్రాంతం అక్కడి ప్రజల స్థితిగతులు, నిర్వహణకు అయ్యే వ్యయం తదితర అంశాలకు ప్రాతిపదికగా తీసుకుని ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్, పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఇలా కొన్ని కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించాలనుకున్నారు.

కానీ.. కోవిడ్ పరిస్థితులు, ఫీజులపై సమాచారం ఇచ్చేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోవడం, కోర్టు ఆదేశాల నేపద్యంలో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో గత ఏడాది ఆయా సంస్థలు వసూలు చేసిన ఫీజులనే ప్రామాణికంగా తీసుకుని.. అందులో 30 శాతం మేర తగ్గింది. రానున్న ఐదు నెలల్లో విడతల వారీగా వసూలు చేసుకోవాలని సూచించింది. ఆ ఫీజుల కోసం విద్యార్థుల తల్లితండ్రులపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "School and College fees reduction (30%) - Education Regulatory and Monitoring Commission Decided"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0