Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Should we send our children to school .. or not ..!

పాఠశాలలకు పంపాలా.. వద్దా ..!

Should we send our children to school .. or not ..!

  • కరోనా భయంతో తల్లిదండ్రుల్లో సందిగ్ధం
  • నేటి నుంచి 8వ తరగతి బోధన ప్రారంభం

 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా..వద్దా అనే సందిగ్దంలో తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో ఇప్పటికే 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన సాగుతోంది. ఈనెల 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించగా 10వ తరగతి విద్యార్థుల హాజరుతో పోలిస్తే 9వ తరగతి విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. మండ లంలో మొత్తం జడ్పీ హైస్కూళ్లు ఎనిమిది ఉన్నాయి. ఏడో నుంచి ఈ ఏడాది ఎనిమిదో తరగతికి 640 మంది విద్యార్థులు  ప్రమోట్‌ అయ్యారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు 1211 మంది ఉన్నారు.  మొత్తం ఎనిమిది హైసూళ్లలో శనివారం తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు కేవలం 230 మంది హాజర య్యారు. వీరిలో 85 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. ఇక  టీచ ర్లు 106 మందికి 88 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎని మిదో తరగతి విద్యార్థుల హాజరు కూడా మెరుగ్గా ఉంటుందని భావించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు 9,10 విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో మండలంలోని ఆయా పాఠశాలల పరిధిలో విద్యార్థుల గృహాలకు ఉపాధ్యాయులే వెళ్లి భయం లేదు.. స్కూళ్లకు పంపండి అంటూ హామీ ఇస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించేలా పర్యవేక్షించడం, బడి బయట చిరుతిళ్ళ నుంచి దూరం చేయడం కష్టమని తల్లిదండ్రులు అంటున్నారు. కరోనా రెండవ దశ ప్రారంభమవుతుందన్న వార్తల నేపథ్యంలో పిల్లలను బడికి పం పించే విషయంలో చాలామంది తల్లిదండ్రులు ఎటూ తేల్చు కోలేకపోతున్నారు. మరోవైపు పాఠశాలలు తెరిస్తే ఎలా ఉంటుంది, తెరవకపోతే జరిగే నష్టం ఏమిటని అంచనా వేయలేక ప్రైవేటు యాజమాన్యాలు సందిగ్ధంలో ఉన్నాయి. 

పాఠశాలలకు పంపడం ఇబ్బందే 

కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తుందన్న నేపథ్యంలో పిల్లలను పాఠ శాలకు పంపించడం ఇబ్బందే. శీతాకాలంలో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో తరగతు లను నిలుపుదల చేయడం మంచిది. 

వ్యాక్సిన్‌ వచ్చే వరకూ తెరవొద్దు 

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకూ పాఠశాలలు తెరవకుండా ఉండాలి. ప్ర స్తుతం భయంతోనే పాఠశాలలకు పంపు తున్నాం. చదువులు ముఖ్యమే. కానీ అంతకన్నా మా పిల్లల ఆరోగ్యం ముఖ్యం. వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు పాఠ శాలలకు వస్తుంటారు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 

అవగాహన కల్పించాలి : 

కరోనా వైరస్‌ తీవ్రత తగ్గలేదు. పిల్లలను బడికి పంపించాలంటే భయం వేస్తోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించినా పక్కపక్క గ్రామాల్లో పాఠశాలలు ఉన్నప్పుడు, విద్యార్ధులందరూ కలిసి వెళ్తున్నప్పుడు సమస్య వచ్చే అవకాశం ఉంది.  

జాగ్రత్తలు తీసుకుంటున్నాం 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నాం. తరగతి గదులను శానిటేషన్‌ చేయించాం. పిల్లలం దరికి తరగతి గదుల్లో శానిటైజర్‌ అందిస్తాం. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Should we send our children to school .. or not ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0