Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The corona second wave is coming

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

The corona second wave is coming

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

రాష్ట్రంలో మనం జాగ్రత్తగా ఉండాలి: సీఎం వైఎస్‌ జగన్‌

 కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే పలు దేశాల్లో వ్యాపించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్‌పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌–19 నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..

యూరప్‌ మొత్తం వణుకుతోంది

  • కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో యూరప్‌ మొత్తం వణుకుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపిస్తోంది. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్‌. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. 
  • అక్కడ మొదలు కాగానే ఇక్కడా వస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  • స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి.
  • ప్రస్తుతానికి కోవిడ్‌ పాజిటవ్‌ కేసులు తగ్గినా, సెకండ్‌ వేవ్‌ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 
  • రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాం. కొన్నిరోజుల క్రితమే 90 లక్షల మార్కును దాటేశాం. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1.7 లక్షలకు పైగా
  • పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ రేటు తగ్గింది. కోవిడ్‌ నివారణకు చేసిన కృషికి కలెక్టర్లకు అభినందనలు.

104 నంబర్‌ను అభివృద్ధి చేయాలి

  • 104 నంబర్‌ను సింగిల్‌ పాయింట్‌ కాంటాక్ట్‌గా అభివృద్ధి చేయాలి.
  •  ఈ నంబర్‌పై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి.
  • ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే 30 నిమిషాల్లో బెడ్‌ కేటాయించాలి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The corona second wave is coming"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0