Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are there any problems with your Aadhaar card? You can call this number immediately and resolve.

 మీ ఆధార్ కార్డులో ఏవైనా సమస్యలున్నాయా .. ? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోగలరు.

Are there any problems with your Aadhaar card? You can call this number immediately and resolve.

ఆధార్ కార్డు.. ఇది అన్నింటికి ఆధారం. ఇందులో ఏవైనా తప్పులున్నట్లయితే ఇక సమస్య వచ్చినట్లే. చాలా మంది ఆధార్ కార్డులోని పేర్లు, చిరునామా తదితర తప్పులు దొర్లుతుంటాయి. వారిని సరి చేసుకోవాలంటే నానా తంటాలు పడుతూ మీ సేవ కేంద్రాల చుట్టు తిరగాల్సిందే. కొందరు ఏం చేయాలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు పడకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీరు ఆధార్ హెల్ఫ్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడీఏఐ ఆధార్ హెల్ఫ్ లైన్ నెంబర్‌1947ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు దారులు తమ సమస్యలపై ఈనెంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మీ సందేహాలకు వారు సమాధానాలను, సమస్యల పరిష్కారాలను వివరిస్తారు.

ఆ తర్వాత మీరు ఏం చేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

1947 నెంబర్‌కు ఉచితంగా కాల్ చేసే అవకాశం కల్పించారు అధికారులు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కాగా, రోజూ లక్షన్నరకు కాల్స్ స్వీకరించే సామర్థ్యం ఈ యూఐడీఏఐ కాల్ సెంటర్‌కు ఉంది. ఆధార్ కార్డు దారులు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాల్ చేయవచ్చు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటల్ అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are there any problems with your Aadhaar card? You can call this number immediately and resolve."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0