Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Check Payment Rules: Details of RBI's new rules for check transactions effective January 1

 Cheque Payment Rules : చెక్ ట్రాన్సాక్షన్ కు RBI కొత్త రూల్స్ జనవరి 1 నుండి అమలు వివరాలు.

Check Payment Rules: Details of RBI's new rules for check transactions effective January 1


నకిలీ చెక్కులతో కూడా కేటుగాళ్లు దోచేస్తున్నారు. నిత్యం దేశంలో ఒక్కడో ఒకచోట నకిలీ చెక్కులతో ఆర్థిక నేరగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకింగ్ మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) వచ్చే ఏడాది ప్రారంభం నుండి నూతన పద్ధతిని అమల్లోకి తీసుకురానుంది. ఇక మీదట రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బును చెల్లించే లావాదేవీలు నిర్వహించే విషయంలో చెల్లింపుదారులు పలు జాగ్రత్తలు తీసుకొవాల్సి ఉంటుంది. 'పాజిటివ్ పే సిస్టమ్'గా పేర్కొనే ఈ కొత్త విధానాన్ని 2021 జనవరి 1 నుండి అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.

పాజిటివ్ పే సిస్టమ్ లో రూల్స్

ఈ నూతన పద్ధతి ప్రకారం రూ .50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ను చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఖాతాదారుడి అభీష్టానుసారం ఇది చేయవలసి ఉంటుంది.

రూ .5 లక్షలకు మించి చెల్లింపులకు మాత్రం చెక్లు తప్పనిసరి చేయనుంది ఆర్బీఐ.

కాగా చెక్ ఇచ్చేవారు, పాజిటివ్ పే సిస్టమ్ కింద, ఆ చెక్ యొక్క మినిమం డిటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుంది. చెక్ జారీ చేసిన తేదీ, లబ్ధిదారుడి పేరు, చెల్లింపుదారుడి పేరు, డబ్బులు తీయాలనుకున్న బ్యాంకు పేరు వంటి వివరాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనగా ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎంల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

చెల్లింపు చేసే ముందు చెక్ వివరాలు బ్యాంకు ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేయబడతాయి. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సిటిఎస్) ద్వారా ఎలాంటి అనుమానాస్పద అంశాలు పరిశీలనకు వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే అవకకాశం ఉంటుంది.

కాగా కొన్ని పార్టిసిపెంట్స్ బ్యాంక్స్లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) డెవలప్ చేసిన సిటిఎస్‌ పాజిటివ్ పే ను వాడనున్నారు. అకౌంట్ హోల్డర్లకు రూ .50 వేలు మరియు అంతకంటే ఎక్కువ మొత్తాలకు చెక్కులు జారీ చేసే ఖాతాదారులందరికీ బ్యాంకులు దీన్ని ప్రారంభిస్తాయి.

నూతనంగా ప్రారంభించనున్న పాజిటివ్ పే సిస్టమ్ గురించి బ్యాంకులు తమ కస్టమర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్స్, బ్రాంచ్‌లు, ఎటిఎంలు, వెబ్సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవగాహన కల్పించాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను సూచించింది.

2021 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన పాజిటివ్ పే సిస్టమ్కు అనుగుణంగా నియమాలు నిబంధనలు పాటించిన వారి చెక్లు మాత్రమే క్లియర్ అవుతాయి. దీనికి సంబంధించి అన్ని బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛను కల్పించనుంది ఆర్బీఐ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Check Payment Rules: Details of RBI's new rules for check transactions effective January 1"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0