Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

At the school level principals are the immediate steps they need to take.

పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వారు తీసుకొనవలసిన తక్షణ చర్యలు.

At the school level principals are the immediate steps they need to take.

  • 1. అమ్మఒడి లాగిన్ నుండి అర్హత కలిగిన, అర్హత లేని మరియు విత్ హెల్డ్ జాబితాలను సంబంధిత వెబ్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకొని  పాఠశాలలో ఉపాధ్యాయులందరూ/ కమిటీ ఆ జాబితాలను పాఠశాల నోటీసు బోర్డ్ నందు ప్రదర్శించవలెను. 
  • 2. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు తరగతి వారీగా అర్హత కలిగిన, అర్హత లేని మరియు విత్ హెల్డ్ జాబితాలను సంబంధిత తరగతి ఉపాధ్యాయునికి అందజేసి, పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకొనవలెను.   అర్హత కలిగిన వారి జాబితాల వివరములను పునఃపరిశీలన (ఆథార్ కార్డు వివరములు, బ్యాంక్ ఖాతా వివరములు) చేసి వాటి యందు తప్పిదములు ఏవైనా ఉన్నయెడల సరిచేయవలెను.
  • 3. అర్హత కలిగి, వేరు వేరు కారణములు వలన అనర్హత జాబితాలో ఉన్నవారిని అర్హత కలిగిన దృవపత్రముల నకలను సంబంధిత గ్రామ సచివాలయములో అందజేసే విధంగా అవగాహన కలిగించి తగు చర్య తీసుకొనవలెను.  ఇందుకు సంబంధించి పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు తీసుకొనవలెను.
  • 4. అమ్మఒడి లాగిన్ నుండి అర్హత కలిగిన, అర్హత లేని మరియు విత్ హెల్డ్ జాబితాలను సంబంధిత వెబ్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకొని  పాఠశాలలో ఉపాధ్యాయులందరూ/ కమిటీ ఆ జాబితాలను కూలంకషంగా పరిశీలించాలి.  ముఖ్యంగా అర్హత లేని మరియు విత్ హెల్డ్ జాబితాలను సరిచూసి దానికి చూపిన కారణాలను ఆ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. ఎవరైనా తల్లిదండ్రులు తాము అక్కడ చూపిన కారణము సరికాదని చెప్పినయెడల దానికి తగిన దృవపత్రములను తీసుకొని ఆ గ్రామ/వార్డు సచివాలయము ద్వారా అమ్మఒడి పోర్టల్ నందు అర్హత పొందుటకు వివరాలను అప్లోడ్ చేయాలి.
  • 5. అర్హత లేని మరియు విత్ హెల్డ్ జాబితాలలో బ్యాంక్ ఖాతా వివరములు, రేషన్ కార్డు వివరములు, ఆథార్ నెంబర్ లలో తేడాలు ఆ జాబితాలలో ఉంటే వాటిని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు సరిచేయవలసి ఉంటుంది.  
  • 6. ఆ విధంగా ప్రదర్శించిన సమాచారముపై అభ్యంతరాలు వచ్చినట్లయితే ఆ అభ్యంతరాలు రెండు విధాలుగా ఉండవచ్చును.
  • అ) తల్లి లేదా సంరక్షకుల ఆథార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ సంబంధించిన అంకెలలో పొరపాట్లు, అటువంటివాటిని ప్రధానోపాధ్యాయులు సరిచేయవలసి ఉంటుంది.
  • ఆ) అనర్హత పట్ల అభ్యంతరాలను గ్రామ/వార్డు సచివాలయాల శాఖవారు విడుదలచేసిన స్టాండర్డ్ ఆఫరేటింగ్ ప్రొసీజర్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించవలసి ఉంటుంది.  వాటిని జాయింట్ కలెక్టర్ గారు పరిష్కరిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "At the school level principals are the immediate steps they need to take."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0