Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

covid-19 Vaccine: Corona Vaccine Distribution in AP ... Date Fix ... These are the full details.

 Covid-19 Vaccine: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ... డేట్ ఫిక్స్... ఇవీ పూర్తి వివరాలు.

covid-19 Vaccine: Corona Vaccine Distribution in AP ... Date Fix ... These are the full details.

Covid 19 Vaccine in AP: ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాల్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మొత్తం 4,762 ఆరోగ్య కేంద్రాల్లో ఈ వాక్సినేషన్ జరుగుతుందని ఆయన వివరించారు. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించిందని విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చేవారికి ట్రైనింగ్ ఇస్తున్నారు.

అలాగే... వ్యాక్సిన్ల పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8,76,336కి చేరాయి. కొత్తగా 5గురు కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,064కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,37,377 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా 61,452 మందికి టెస్టులు చేశారు. ఏపీలో ఇప్పటివరకు 8,64,612 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ప్రస్తుతం ఏపీలో 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇండియాలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో జనవరి 2వ వారంలో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆక్స్‌ఫర్డ్-ఆస్త్రాజెనెకా కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ (CoviShield) వ్యాక్సిన్‌ను పంపిణీ చేయబోతున్నారు. ఈ టీకాను ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో బేగంబజార్, శ్రీరాంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని స్టోరేజ్ సెంటర్లకు డోసులను తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అవసరమైన వారికి పంపిణీ చేస్తారు. ఇతర వ్యాక్సిన్ల లాగే... ఈ వ్యాక్సిన్ కూడా 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిల్వ చేయబోతున్నారు. తెలంగాణలో 2.67 లక్షల మందికి ముందుగా ఈ వ్యాక్సిన్ అందనుంది. రోజూ 100 మందికి టీకా ఇవ్వనున్నారు.

టీకా వేయించుకోవాలనుకునేవారు ముందుగా ఆన్‌లైన్‌లో కోవిడ్ సాఫ్ట్‌వేర్‌లో తమ పేరును నమోదుచేసుకోవాలి. ఇందుకు సంబంధించిన యాప్ లేదా సాఫ్ట్‌వేర్ త్వరలో రానుంది. పేరు నమోదు తర్వాత వారి మొబైల్‌కి ఎక్కడ వ్యాక్సిన్ వేస్తారో మెసేజ్ వస్తుంది. ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డుతో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. జనవరి 3వ వారం నుంచి ఈ వ్యాక్సిన్ వేయాలనుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలాఖరున ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "covid-19 Vaccine: Corona Vaccine Distribution in AP ... Date Fix ... These are the full details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0