Diet counseling from today until 7 .
నేటినుంచి నుంచి 7 వరకూ డైట్ కౌన్సెలింగ్
డైట్లో చేరాలి అంటే ఇవి మీవద్ద ఉండాలి.
కౌన్సెలింగ్‌లో ఇవ్వాల్సిన ధ్రువపత్రాలు (అన్నీ ఒరిజినల్)
- ఇంటర్మీడియట్ మార్కుల ధ్రువపత్రం
- ఇంటర్ లేదా డిగ్రీ బదిలీ ధ్రువపత్రం(టీసీ)
- పదోతరగతి ధ్రువపత్రం (పుట్టినతేదీ కోసం- 2020 సెప్టెంబరు నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి) గరిష్ట వయోపరిమితి లేదు.
- స్టడీ సర్టిఫికెట్లు (ఏడేళ్లు వెనక్కి)... స్టడీ లేకుంటే రెసిడెన్స్
- మీసేవ నుంచి తీసుకున్న కులధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్సీ, ఎస్టీ)
- డీసెట్ హాల్‌టిక్కెట్, ర్యాంకు కార్డు
ఫీజు వివరాలు ఇలా...:
ప్రభుత్వ కళాశాలల్లో(డైట్) అయితే రూ.2,385(ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా తెల్లరేషన్‌కార్డు ఉంటే ఫీజు పూర్తిగా ఉండదు)
ప్రైవేటు కళాశాల అయితే రూ.12,500(ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా తెల్ల రేషన్‌కార్డు ఉంటే రూ.1500)
ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అదేరోజు ఫీజు మీసేవలో చెల్లించి ఆ రశీదును డైట్లో ఇస్తే ప్రవేశ ఉత్తర్వు ఇస్తారు. ఏ జిల్లాలో సీటు వస్తే అక్కడి డైట్‌లోనే చేరాలి.
వెబ్ఆప్షన్లు పెట్టాక చరవాణికి వచ్చిన సందేశం ఆధారంగా అలాట్మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని అందులో ఏ జిల్లా కళాశాలలో సీటు వస్తే ఆ జిల్లా ప్రభుత్వ డైట్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.
ర్యాంకుల వారీగా ఏ తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్న ప్రవేశకేటాయింపు లేఖలో ఉంటుంది.
2nd fage counciling appati nundi
ReplyDelete