Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NIA Faculty Teaching and Non-Teaching Vacancy Recruitment 2020-21

 NIA Faculty Teaching and Non-Teaching Vacancy Recruitment 2020-21

NIA Faculty Teaching and Non-Teaching Vacancy Recruitment 2020-21

ఎన్ఐఏలో టీచింగ్‌, నాట్ టీచింగ్ పోస్టులు.

భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన జ‌య‌పుర‌(రాజ‌స్థాన్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద‌(ఎన్ఐఏ) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు

మొత్తం ఖాళీలు: 52 

పోస్టులు-ఖాళీలు: అసొసియేట్ ప్రొఫెస‌ర్‌-01, లెక్చ‌ర‌ర్‌-08, మ్యూజియం క్యురేట‌ర్‌-01, ఫార్మసిస్ట్‌-03, క్యాట‌లాగ‌ర్‌-01, ఎల్‌డీసీ-02, ఎంటీఎస్‌-36. 

అర్హ‌త, వ‌య‌సు: 

1) అసోసియేట్ ప్రొఫెస‌ర్‌: స‌ంబంధిత స‌బ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ(ఆయుర్వేద‌) ఉత్తీర్ణ‌త‌. ఐదేళ్ల టీచింగ్‌(మూడేళ్లు పీజీ టీచింగ్‌), ప‌రిశోధ‌నా అనుభ‌వం. 

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 50 ఏళ్లు మించ‌కూడ‌దు. 

2) లెక్చ‌ర‌ర్‌: 

విభాగాలు: ద్ర‌వ్య‌గుణ‌, కౌమార్ బ్రితియ‌, క్రియా శ‌రీర్‌, పంచ‌క‌ర్మ‌, ప్ర‌సూతి తంత్ర‌, రాస శాస్త్ర‌, స్వ‌స్థ్ వ్రిట్టా. 

అర్హ‌త‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ(ఆయుర్వేద‌) ఉత్తీర్ణ‌త‌, ప‌రిశోధ‌నలో అనుభ‌వం, కంప్యూట‌ర్ నాలెడ్జ్. 

వ‌య‌సు:  ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 40 ఏళ్లు మించ‌కూడ‌దు. 

3) మ్యూజియం క్యురేట‌ర్‌: బీఎస్సీ(బోట‌నీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు రెండేళ్ల‌ సంబంధిత అనుభ‌వం. 

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు. 

4) ఫార్మ‌సిస్ట్‌: ఇంట‌ర్మీడియ‌ట్, ఆయుష్ న‌ర్సింగ్ & ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో పాటు మూడేళ్ల‌కు త‌గ్గ‌కుండా ఇంట‌ర్న్‌షిప్/ ఆయుర్వేద‌లో బీఫార్మ‌సీ చేసి ఉండాలి. 

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు. 

5) క్యాట‌లాగ‌ర్‌: ప‌దోత‌ర‌గ‌తి, లైబ్ర‌రీ సైన్స్‌లో ఏడాది డిప్లొమా కోర్సు ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు. 

6) లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌(ఎల్‌డీసీ): ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌తతో పాటు ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 ప‌దాలు, హిందీలో నిమిషానికి 30 ప‌దాల టైపింగ్ స్పీడ్. 

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు. 

7) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 25 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వ‌హిస్తారు. ఇందులో అర్హ‌త సాధించిన వారిని ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 60 రోజుల్లోపు. 

చిరునామా: Director, National Institute of Ayurveda, Jorawar Singh Gate, Amer Road, Jaipur 302002. 

WEBSITE: http://www.nia.nic.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " NIA Faculty Teaching and Non-Teaching Vacancy Recruitment 2020-21"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0