Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Transfers 2020

ఆప్షన్ల ప్రక్రియ అస్తవ్యస్తం...!

AP Teachers Transfers 2020

  • ఇచ్చిన ఆప్షన్లు ఒక్కటీ కనిపించని దృశ్యం
  • తప్పనిసరి బదిలీ టీచర్లకు నరకం
  • అర్ధరాత్రి వరకూ కూర్చున్నా....ఫలితం శూన్యం
  • సైట్‌లో కొన్ని మండలాలే చూపుతున్న వైనం
  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
  • ఆప్షన్లకు నేటితో ముగియనున్న గడువు

అనంతపురం విద్య, డిసెంబరు 17 : ఉపాధ్యాయుల బదిలీల్లో ఆప్షన్ల ప్రక్రియ టీచర్లకు కన్నీరు తెప్పిస్తోంది. రోజుల తరబడి, అర్ధరాత్రి వరకూ కూర్చుని కష్టపడినా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా తప్పనిసరి( కం పల్సరీ) బదిలీ టీచర్లకు ఈ ప్రక్రియ నరకంగా మారిం ది. 63 మండలాలు కాకుండా కొన్ని మండలాలే చూపడం, ఉన్నఫలంగా ఎర్రర్‌ కావడంతో టీచర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. 

ఆప్షన్లు....హైటెన్షన్‌.

బదిలీ ఉపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వడం హైటెన్షన్‌గా మారింది. రోజుకొక సమస్య, గంటకో ఇబ్బంది తలెత్తు తోంది. 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లకు, 5 ఏళ్లు పూర్తి చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి. దీంతో వారికి ఆప్షన్లు ఇవ్వడం గగనంగా మారింది.  10 నుంచి 15 గంటలు కూర్చుని ఆప్షన్లు ఇచ్చు కోవాల్సి వస్తోంది. ఆప్షన్లు ఇచ్చే క్రమంలో సైట్‌లో జిల్లాకు సంబంధించి 63 మండ లాలు చూపాల్సిన చోట 4 మండలాలు, 10 మండలాలు చూపుతోంది. ఫలితంగా ఇతర మండలాల్లోని స్థానాలకు ఆప్షన్లు ఇవ్వలేకపోతున్నారు. 500 లేదా 600 ఆప్షన్లు ఇచ్చి సబ్మిట్‌ చేస్తే.... అన్నే ప్లేసులు చూపాలి. కానీ ఇష్ట్టానుసారం ప్లేసులు చూపుతోంది. ఆఖరికి అవి అంుునా ఎడిట్‌ చేద్దామనుకుని ఎడిట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే.. ఖాళీలు చూపడం లేదని, డౌన్‌లోడ్‌ చేద్దామని పోతే...సైట్‌ ఖాళీగా చూపు తోందంటూ  ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 

మొద్దునిద్రలో ఐటీ సెల్‌

బదిలీల్లో ఆప్షన్ల ప్రక్రియలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. కొందరు మహిళా టీచర్లైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సర్వర్‌ సమస్య పాటు, సాఫ్ట్‌వేర్‌, సాంకేతిక సమస్య లు భారీగా వస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఆప్షన్లు ఇస్తున్నా...అవి కంప్లీట్‌ కావడం లేదు. సమస్యలను డీఈఓ ఆఫీస్‌లోని ఐటీ సెల్‌కు తీసుకెళ్దామని చూస్తే... ఎవరూ స్పందించ డంలేదు. పైగా మాకు ఏం తెలి యదు....అంతా కమిషనర్‌ ఆఫీస్‌ వాళ్లే చూస్తున్నారంటూ తప్పించు కుంటున్నారు. ఫలితంగా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలి యక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు.  

  • ఖాళీలన్నీ చూపితే 5 వేల బడుల మూత!
  • మారుమూల పాఠశాలల కోసమే బదిలీల్లో పోస్టుల బ్లాక్‌
  • మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఉపాధ్యాయ బదిలీల్లో కొన్ని పోస్టులను బ్లాక్‌ చేయకపోతే మారుమూల పాఠశాలలు మూతపడతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అన్ని ఖాళీలను బదిలీల్లో చూపితే రాష్ట్ర వ్యాప్తంగా 145మండలాల్లోని 5,725 పాఠశాలలపై ప్రభావం పడుతుందని, 10,195 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అవుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. బదిలీల ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 48,897 పోస్టులకు 16,007 మాత్రమే బ్లాక్‌ చేశామని, ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్ల నమోదు, సవరణలకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అవకాశం కల్పించామని వెల్లడించారు. తప్పనిసరి బదిలీ కానున్న 26,117మందిలో 25,826మంది ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారని, అభ్యర్థన బదిలీల కోసం 50,002మంది దరఖాస్తు చేసుకోగా.. 48,595మంది ఐచ్ఛికాలు ఇచ్చారని వివరించారు. ఐచ్ఛికాల నమోదుకు సహకరించిన ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐచ్ఛికాల నమోదు, సవరణల కోసం ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఉండడంతో సర్వర్‌ సమస్య తలెత్తుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలవారీగా సర్వర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Transfers 2020 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0