Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Amma Odi is not with them ..?

అమ్మ ఒడి వీరికి లేనట్టేనా..?

Amma Odi is not with them ..?

  • జూనియర్‌ ఇంటర్‌కు చాన్స లేదు !
  • ఐదేళ్ల వయసు ప్రామాణికతపై ఒకటో తరగతికి అనుమానమే
  • ఎడాపెడా రేషన్‌ కార్డుల రద్దుతో మరికొందరు దూరం
  • అర్హుల జాబితాలో ఉంటామో లేమోనని ఆందోళన

రెండో విడత అమ్మ ఒడి పథకానికి కొంత మంది దూరం కానున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు జనవరి తొమ్మిదో తేదీన అమలు చేయనున్న రెండో విడత అమ్మ ఒడి నగదు చెల్లింపుల్లో ఈ దఫా కరోనా ఉధృతి, వేల సంఖ్యలో తెల్ల రేషన్‌ కార్డుల రద్దు, తదితర అంశాలు ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించనున్నాయి. జిల్లాలో గతేడాదికంటే రూ.కోట్లలోనే భారం తగ్గుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో అడ్డగోలుగా తెల్ల రేషన్‌ కార్డులను రద్దు చేయడం ద్వారా అమ్మ ఒడి సాయం వేల సంఖ్యలో లబ్ధిదారులకు ఎగ్గొట్టడానికి అవకాశం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.

అయోమయంలో ఒకటో తరగతి అడ్మిషన్లు 

అన్‌లాక్‌ నిబంధనల నేపథ్యంలో నవంబరు 2వ తేదీ నుంచి దశల వారీగా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తుండగా, ఐదు రోజుల నుంచి 7వ తరగతికి క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇక ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ, ఆ తదుపరి 6వ తరగతి ప్రారంభంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది కొత్తగా ఒకటో తరగతిలోకి అడ్మిషన్‌ తీసుకున్న చిన్నా రుల వయసుకు, అమ్మ ఒడి నగదు సాయానికి అర్హత విషయంలో లింకు పెట్టడంపై ఒకింత డైలమా నెలకొంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం నాటికి 48,355 మంది పిల్లలు ఒకటో తరగతిలోకి అడ్మిషన్లు తీసుకున్నారు. వీరందరి వివరాలు చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో నమో దయ్యాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి ఐదేళ్ల వయసు నిండి ఒకటో తరగతిలో చేరిన పిల్లల నుంచి మాత్రమే అమ్మ ఒడికి అర్హులైన తల్లుల సంఖ్యను తేల్చేందుకు ప్రామాణికంగా నిర్ధేశించారు. ఇప్పటికే నమోదైన చైల్డ్‌ ఇన్‌ ఫో డేటా నుంచి నిర్ణీత కటాఫ్‌ డేట్‌ను ప్రామాణికంగా తీసుకుని పిల్లలను ఆ జాబితాల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఆగస్టు 31వ తేదీ నాటికి ఐదేళ్ల వయసు నిండిన పిల్లలకు మాత్రం అమ్మ ఒడిని వర్తింపచేసి ఆ తరువాత జన్మించిన వారిని ఒకటో తరగతి అడ్మిషన్‌కు మాత్రమే (అమ్మ ఒడి లేకుండా) పరిమితం చేసే అవకాశం ఉంది. 

రేషన్‌ కార్డుల ఎఫెక్ట్‌

జిల్లాలో 64,056 రేషన్‌కార్డులను ఇటీవల రద్దు చేశారు. ఇలా రద్దు చేసిన రేషన్‌ కార్డుదారుల్లో అర్హులెవరైనా ఉంటే రైస్‌ కార్డులను మంజూరుచేశారు. రద్దు చేసిన రేషన్‌ కార్డుల్లో 61 వేలకు పైగా తెల్లరేషన్‌ కార్డులు కాగా, మిగతా వన్నీ అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు. అమ్మ ఒడికి తెల్ల రేషన్‌కార్డు ప్రధాన అర్హత. వివిధ కారణాలు, సర్వేలతో పెద్ద సంఖ్యలో తెల్ల రేషన్‌ కార్డులను రద్దు చేయడంతో ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రద్దుచేసిన కార్డుల్లో ఎవరికైనా అర్హతలుంటే కొత్త గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించిన వెంటనే కార్డు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వేల సంఖ్యలో రేషన్‌ కార్డులను రద్దు చేయడం ద్వారా ఆ మేరకు నష్టపోయిన కార్డుదారుల్లో అమ్మఒడి లబ్ధ్దిదారులు ఎంత మంది ఉన్నారో తేలాల్సి ఉంది. 

వీరికి లేనట్లే

అమ్మఒడి ఆర్థిక సహాయం మంజూరుపై డీఈవో సీవీ రేణుక గురువారం స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి విద్యార్థి వయసు ఐదేళ్లు నిండకపోయినా.. డిసెంబరు 19వ తేదీ నాటికి తల్లికి, విద్యార్థికి ఆధార్‌ నెంబర్‌ లేకపోయినా, రేషన్‌ కార్డు లేదా రైస్‌ కార్డు లేకపోయినా, రేషన్‌కార్డు హోల్డ్‌ /ఇనేక్టివ్‌లో ఉన్నా..కుటుంబంలో ఎవరి పేరునైనా నాలుగు చక్రాల వాహనం ఉన్నా.. నిర్ధేశించిన పొలంకన్నా ఎక్కువ ఉన్నా.. గతంలో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలు చేసినా.. ఆరు నెలల్లో నిర్ధేశించిన మొత్తంకంటే విద్యుత్‌ బిల్లులు ఎక్కువ మొత్తంలో చెల్లించినా.. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు వేర్వేరు బ్యాంకు అకౌంట్‌ నెంబర్లు ఇచ్చినా, అలాగే బ్యాంకు ఖాతా మనుగడలో లేకపోయినా.. కుటుంబంలో ప్రభుత్వ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతం, పెన్షన్‌ పొందుతున్న వారు ఉన్నా అమ్మ ఒడికి అనర్హులవుతారని స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌

అమ్మ ఒడి సమస్యల పరిష్కారానికి ఏలూరు తమ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ పనిచేసేలా 08812–230343 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు. ‘ప్రజా సాధికార సర్వేతో సరిచూసి ఈ నెల 20న మొదటి అర్హులైన తల్లుల జాబితా ను విడుదల చేస్తాం. ఈ జాబితాలను స్కూలు/ కళాశాల, గ్రామ /వార్డు సచివాలయ నోటీసు బోర్డు ల్లో ప్రదర్శిస్తాం. జాబితాల్లో తల్లులు లేదా సంరక్ష కుల ఆధార్‌ నెంబర్‌, బ్యాంక్‌ అక్కౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నెంబర్లలో తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత హెచ్‌ఎంలను సంప్రదించాలి. అనర్హులు గా తేలితే వార్డు/గ్రామ సచివాలయాల్లో తమ అర్హతలకు సంబంధించిన పత్రాల నకళ్ళను ఈ నెల 25లోగా అందజేయాలి. వీటిని వారు ఆన్‌లైన్‌లో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) పరిశీలనకు అందజేస్తారు. ఈ నెల 26న అమ్మఒడి తుది జాబితా విడుదల చేసి, 27, 28 తేదీల్లో గ్రామసభ/వార్డు సభల్లో పెట్టి ఆమోదం తీసుకున్న అనంతరం 30న కలెక్టర్‌కు సమర్పిస్తాం’ అని డీఈవో చెప్పారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Amma Odi is not with them ..?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0