Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PM Modi: This is the motto of the year 2021. This is what Prime Minister Modi taught in 2020.

 PM Modi : ఇదే 2021 ఏడాది నినాదం .. 2020 నేర్పింది ఇదేనన్న ప్రధాని మోదీ.

pM Modi: This is the motto of the year 2021. This is what Prime Minister Modi taught in 2020.

PM Modi : ప్రపంచంలోనే సుదీర్ఘమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం భారత్ సిద్ధమవు తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

మందు లేనప్పుడు అలసత్వం వద్దని తాను గతంలో చెప్పానని గుర్తు చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. మందుతో పాటు జాగ్రత్తగా ఉండాలన్నది కొత్త సంవత్సరం నినాదమని అన్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం భారత్ సిద్ధమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌లో ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని 2020 మనకు చాటిచెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని అన్నారు. ప్రపంచ ఆరోగ్యానికి భారత్ నాడి కేంద్రంగా ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు.

భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానున్న క్రమంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. వ్యాక్సినేషన్ జరిగే సమయంలో పుకార్లను పట్టించుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన దేశంలో పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని అన్నారు. అనేక మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బాధ్యత లేకుండా పుకార్లు వ్యాప్తి చేస్తారని వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ సమయంలో ఇలాంటి పుకార్లు రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అలాంటి పుకార్లు కొన్ని మొదలయ్యాయని అన్నారు. కరోనాతో పోరాటమంటే కనిపించని శత్రువుతో పోరాటమన్న ప్రధాని మోదీ.. కొందరు ఏ మాత్రం చెక్ చేసుకోకుండా ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేస్తారని అన్నారు. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

2021లో ఆరోగ్య రంగంలో మన సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాజ్‌కోట్‌లో నిర్మించనున్న ఎయిమ్స్‌ను 201 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందుకు రూ. 1195 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 750 పడకలు 30 పడకల ఆయుష్ విభాగం ఉండేలా డిజైన్ చేశారు. ఇందుకు అనుబంధంగా ఉన్న కాలేజీలో 125 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు ఉంటాయని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2022 జూన్ జులై నాటికి ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

5 Responses to "PM Modi: This is the motto of the year 2021. This is what Prime Minister Modi taught in 2020."

  1. For migrant workers, UPBOCW provides 3000 rupees under the medical scheme UPBOCW UP portal for श्रमिक पंजीयन कार्ड

    ReplyDelete
  2. UPSSB पर भी श्रमिक पंजीकरण शुरु हो चुका है

    ReplyDelete
  3. UPBOCW portal par shramik ka panjikaran hota hai

    ReplyDelete
  4. श्रमिक पंजीयन कार्ड Uttar Pradesh State upbocw

    ReplyDelete
  5. nice article admin keep it up श्रमिक पंजीयन कार्ड upbocw

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0