Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A nanny for each school

 ప్రతి పాఠశాలకూ ఒక ఆయా

A nanny for each school

టాయిలెట్ల నిర్వహణకు 3,500 మంది ఆయాల భర్తీకి కసరత్తు

నెలకు రూ.6 వేల వేతనం

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నియామకం

స్థానికులకే అవకాశం..

 కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలలు అంటేనే విద్యార్థులకు సరైన సౌకర్యాలు ఉండవనే అభిప్రాయం ఉంది. అది నిన్న టివరకే.. ప్రస్తుత సర్కార్ స్కూళ్లను చూస్తే ఏదైనా కార్పొరేట్ స్కూల్ కు వచ్చామా అన్న భ్రమ కలగడం ఖాయం. దేశ చరిత్రలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని విధంగా సరస్వతి నిలయాలను తీర్చిదిద్దిన ప్రభుత్వం ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో టాయిలెట్లను శుభ్రంగా ఉం చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఇందులో విద్యా ర్థులను సైతం భాగస్వామ్యం చేసేలా జగనన్న అమ్మ ఒడి పథకం కింద చిన్నారుల తల్లులకు ఏటా ఇచ్చే రూ.15 వేల నగదులో వెయ్యి రూపాయలను టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఈ మొత్తాన్ని డీఈఓ, జేసీల ఆధ్వర్యంలో ఆ స్కూల్ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఆ తరువాత ప్రతి స్కూల్ లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆయాలను నియమిస్తారు. వీరి నియామకాల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వే షన్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఆయాలను నియమించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 జిల్లాలో 3,500 మంది ఆయాల నియామకం జిల్లాలో ప్రభుత్వ అధీనంలో వివిధ యాజమాన్యాల కింద మొత్తం 2,823 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్లలో సుమారు గా 4 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 3,500 మంది ఆయాలను నియ మించే అవకాశం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 40 మంది విద్యార్థులకు బాలురకు రెండు టాయిలెట్లు, ఒకబాత్రూం, బాలికలకు రెండు టాయిలెట్లు, ఒక బాత్రూం ఉండాలి. ఈ ప్రకారం నిర్మించిన టాయిలెట్ల నిర్వహణను గత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం కొన్నిచోట్ల స్కావెంజర్లను నియమించినా వారికి సక్రమం గా వేతనాలు ఇవ్వలేకపోవడంతో టాయిలెట్ల నిర్వహణ అద్వానంగా ఉండేది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే విద్యాశాఖ ఆయాను నియమించి కనీస వేతనం రూ.8 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయాల నియామకం ఈ నెల 31లోగా పూర్తి చేయనున్నారు. 400 మంది లోపు విద్యార్థులుంటే ఒకరు, 401 నుంచి 800 మంది వరకు ఇద్దరు, 800 మంది కంటే ఎక్కువగా ఉంటే ముగ్గురు చొప్పున ఆయాలను నియమించనున్నారు.

స్థానికులకే అవకాశం..

 స్థానికంగా నివాసం ఉన్న వారిని, పట్టణాల్లో ఆ వార్డులో ఉంటున్న వారినే ఆయాగా తీసుకోవాలి. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లుల్లో ఒకరై ఉండాలి. 21 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉండాలి ఆయాగా ఎంపికైన వారికి నెలకు రూ.6 వేలు, విద్యార్థులు 50 మంది కంటే తక్కువగా ఉంటే రూ.3 వేలు వేతనం ఇస్తారు. ఏడాదిలో 10 నెలలు పూర్తి వేతనం, మిగతా రెం డు నెలలు సగం వేతనం చెల్లిస్తారు. ఆయాలు ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులవుతారు. ఆ తరువాత కొనసాగించడం అనేది ఆయా పేరెంట్స్ కమిటీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.®️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A nanny for each school"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0