Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why do telecom companies offer 28-day plans instead of 30-day?

టెలికాం కంపెనీలు 30 రోజులకు బదులుగా 28 రోజుల ప్లాన్లనే ఎందుకు అందిస్తున్నాయి?

Why do telecom companies offer 28-day plans instead of 30-day?

 టెలికాం సంస్థ రిలయన్స్ జియో అందుబాటులోకి వచ్చాక రీచార్జి ప్లాన్లు, డేటాను అందించే పరిమితి వంటి అనేక అంశాలు మారిపోయాయి. గతంలో మనకు 

ఒక్క జీబీ డేటాకు రూ.250 ఖర్చు చేస్తే జియో వచ్చాక రూ.4 ఖర్చు అవుతోంది. అయితే టెలికా కంపెనీలు ప్రస్తుతం చాలా వరకు నెలవారీ ప్లాన్లు అని పెట్టి 30 రోజులు కాకుండా 28 రోజుల పాటు మాత్రమే ప్లాన్లను అందిస్తున్నాయి. ఎందుకంటే..

సాధారణంగా మనం గతంలో ఒక్కసారి రీచార్జి చేస్తే నెల రోజుల పాటు.. అంటే 30 రోజుల పాటు ప్లాన్ వచ్చేది. అయితే 28 రోజుల వల్ల ఏడాదిలో మనం ఒక్కసారి అదనంగా రీచార్జి చేయవలసి వస్తుంది. అంటే.. 28×12 = 336 అవుతుంది. అంటే ఇంకో 29 రోజులు ఏడాదిలో మిగిలి ఉంటాయి.

ఆ రోజులకు ఇంకో సారి అదనంగా రీచార్జి చేయాలి. దీంతో ఏడాదికి 12 కాకుండా 13 సార్లు మనం రీచార్జి చేయవలసి వస్తుంది.

గతంలో 30 రోజుల ప్లాన్లు ఉన్నప్పుడు ఏడాదికి 12 సార్లు మాత్రమే రీచార్జి చేశాం. కానీ 28 రోజుల ప్లాన్ల వల్ల ఏడాదికి అదనంగా ఇంకోసారి.. అంటే 13 సార్లు రీచార్జి చేయాల్సి వస్తోంది. ఇది మనకు నష్టమే. కానీ టెలికాం కంపెనీలకు లాభం ఉంటుంది. అందుకనే చాలా టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్లను 24, 28 రోజుల్లో ఇస్తున్నాయి. ఇక 3 నెలల ప్లాన్‌లో 90 రోజులకు బదులుగా 84 రోజులనే ఇస్తున్నాయి. దీని వల్ల వారికే లాభం ఉంటుంది. కానీ మనకు ప్రయోజనం ఉండదు. వారికి ఈ విధంగా చేయడం వల్ల లాభం వస్తుంది. మనకు నష్టం వస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why do telecom companies offer 28-day plans instead of 30-day?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0