Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Card: Good news ... all these changes are online ... no need to go to Aadhaar Center.

 Aadhaar Card : గుడ్ న్యూస్ ... ఇక ఈ మార్పులన్నీ ఆన్లైన్లోనే ... ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలు తమ ఆధార్ కార్డుల్లో మార్పులు చేయిస్తూ ఉంటారు. ఇందుకోసం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అవసరం. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆన్‌లైన్‌లోనే అనేక సేవల్ని ప్రారంభించింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇంట్లో నుంచే అనేక సేవలు పొందొచ్చు. అయితే కొన్ని సేవల కోసం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లక తప్పదు. మరి ఏఏ సేవల్ని ఆన్‌లైన్‌లో పొందొచ్చో తెలుసుకోండి.

మీరు మీ పేరు మార్చాలనుకుంటున్నారా? పుట్టిన తేదీలో మార్పు ఉందా?

ఆన్‌లైన్‌లో మార్చొచ్చు. ఇవి మాత్రమే కాదు జెండర్, అడ్రస్, ఆధార్ కార్డుపై ఉన్న భాషల్ని మీరు ఆన్‌లైన్‌లోనే సులువుగా మార్చొచ్చు. అయితే బయోమెట్రిక్ అప్‌డేట్ లాంటి కీలక సమాచారాన్ని అప్‌డేట్ చేయాలంటే మాత్రం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. మీరు ఆధార్ కార్డులో ఏ మార్పు చేయాలన్నా ఓటీపీ తప్పనిసరి. ఇందుకోసం మీరు మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇమెయిల్ ఐడీ కూడా అప్‌డేట్ చేయించొచ్చు.

ఆన్​లైన్​లో ఆధార్ సేవా కేంద్ర అపాయింట్​మెంట్​ బుక్ చేసుకోండిలా..

  • అపాయింట్​మెంట్ బుక్ చేసుకోవాలంటే, ముందుగా uidai.gov.in వెబ్​సైట్​కు వెళ్లాలి.
  • అక్కడి నుంచి "My Aadhaar" డ్రాప్ డౌన్ మెనూ ఆర్షన్​లోకి వెళ్లి "Book an Appointment" పై క్లిక్ చేయాలి.
  • అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో నగరం, లొకేషన్​ను ఎంచుకోవాలి. ఆ తర్వాత “ప్రొసీడ్​ టు బుక్ అపాయింట్​మెంట్​”పై క్లిక్ చేయాలి
  • అక్కడ ఫోన్ నంబర్​ను ఎంటర్ చేసి.. వెరెఫికేషన్ కోసం ఫోన్​కు వచ్చే ఓటీపీని సమర్పించాలి.
  • ఆ తర్వాత ఆధార్​ వివరాలు, వ్యక్తిగత సమాచారం సబ్మిట్ చేయాలి.
  • ఆ తర్వాత మనకు అనువైన సమయంలో ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లేందుకు టైమ్​ను ఎంపిక చేసుకోవాలి.
  • అప్పుడు ఓ అపాయింట్​మెంట్ నంబర్ వస్తుంది.
  • ఆధార్ సేవ కేంద్ర కూడా పాస్​పోర్ట్ కేంద్ర లాంటిదే. అక్కడ టోకెట్ సిస్టం ఉంటుంది. ముందుగా టోకెన్ తీసుకొని డాక్యుమెంట్లను చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత క్యాష్ కౌంటర్​కు వెళ్లి సేవకు తగిన డబ్బును చెల్లించాలి.
  • ఆ తర్వాత మీకు కేటాయించిన వర్క్ ఆపరేటర్ కౌంటర్ దగ్గర టోకెన్ నంబర్లు ప్రదర్శిస్తారు. మీ టోకెన్ సంఖ్య వచ్చినప్పుడు ఆపరేటర్ దగ్గరికి వెళ్లాలి.                                                                                                                                   ప్రస్తుతం ఆధార్ కేంద్రాలు అందిస్తున్న సేవలు

కొత్తగా ఆధార్ నమోదు

మార్పు, అడ్రస్​, మొబైల్ నంబర్​, ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్​ మార్పు, బయో మెట్రిక్​ (ఫొటో, ఫింగర్​ప్రింట్​, ఐరిస్​) నమోదు, మార్పులు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar Card: Good news ... all these changes are online ... no need to go to Aadhaar Center."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0