Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To whom was the corona vaccine first given? How to distribute? How long will it take?

 కరోనా వ్యాక్సిన్‌ మొదట అందేది ఎవరికి? పంపిణీ ఎలా? ఎంత సమయం పడుతుంది?

To whom was the corona vaccine first given? How to distribute? How long will it take?

1. టీకా ఎవరికి ముందు

కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న ప్రైవేట్‌, ప్రభుత్వ రంగంలోని సుమారు కోటి మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, రెండు కోట్ల మంది మునిసిపల్‌, విపత్తు నిర్వహణ, జైళ్ల సిబ్బంది, సాయుధ దళాలు, పోలీసులు, హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది, రెస్క్యూ సిబ్బందికి ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. ఈ మూడు కోట్ల మందికి ఉచితంగానే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. మొత్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

50 ఏళ్లు పైబడిన వారికి

ప్రజలలో 50 ఏళ్ల పైబడిన వారిని రెండు రకాలుగా విభజించారు.

 50 నుండి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఒక విభాగం, 60 ఏళ్లు పైబడిన వారు మరో విభాగం. వీరుకాకుండా.. 50 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నా .. డయాబెటిస్‌, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిని కూడా 30 కోట్ల మంది జాబితాలో చేర్చారు.

అధిక తీవ్రత ఉన్న ప్రాంతాలు

కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.

2. నమోదు ప్రక్రియ

కొవిన్‌ (షశీ-షఱఅ) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. లేదా ఒటిపి, బయోమెట్రిక్స్‌, డెమోగ్రాఫిక్‌ విధానంలో ఆధార్‌ నెంబర్‌తో అథెంటికేషన్‌ పొందాలి. అనంతరం టీకా ఇచ్చే తేదీ, సమయం కేటాయిస్తారు. ముందుగా నమోదు చేసుకున్నవారికే టీకా అందుతుంది.

3. వ్యాక్సిన్‌ ఎక్కడ వేస్తారు?

ఇక వ్యాక్సిన్‌ కేంద్రాలను మూడుగా విభజించారు. ఫిక్స్‌డ్‌ సెషన్‌ సైట్‌: వైద్య పరికరాలు, డాక్టర్లు అందుబాటులో ఉండే ఆస్పత్రులు. ఔట్‌రీచ్‌ సెషన్‌ సైట్‌: పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు. స్పెషల్‌ మొబైల్‌ టీమ్స్‌: రవాణా సదుపాయం లేని ప్రాంతాలు. అంతర్జాతీయ సరిహద్దులు వంటివి.

4. పంపిణీ కేంద్రం ఎలా ఉంటుంది?

కేంద్రంలో.. ఒకరు మాత్రమే వేచి ఉండడానికి ఒక గది, టీకా వేయడానికి రెండో గది, తర్వాత.. టీకా వేసిన తర్వాత 30 నిమిషాలపాటు పరిశీలనలో ఉంచడానికి మూడో గది ఉంటాయి.

5.పంపిణీ కేంద్రంలో సిబ్బంది ఎవరు?

నమోదు వివరాలను పరిశీలించడానికి నలుగురు , టీకా వేయడానికి శిక్షణ పొందిన మరొకరు, మొత్తం ఐదుగురు సిబ్బంది కేంద్రంలో సేవలందిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To whom was the corona vaccine first given? How to distribute? How long will it take?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0