Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About 10th Class Examinations

‘పది’ పరీక్షల్లో ఒక్కో ప్రశ్నపత్రమే 

About 10th Class Examinations
సంగం న్యూస్ టుడే:

పదో తరగతి పరీక్షలు పాఠ్యాంశానికో ప్రశ్నపత్రంతోనే నిర్వహించనున్నట్లు డీఈవో రమేష్‌ తెలిపారు. స్థానిక ఎమ్మార్సీలో ‘నాడు- నేడు’ పనులపై శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. కొవిడ్‌తో పూర్తిస్థాయిలో తరగతులు జరగలేదని.. పాఠ్యాంశాలు సైతం తగ్గినట్లు చెప్పారు. తదనుగుణంగానే ఒక్కో సబ్జెక్టుకు ఒకటే ప్రశ్నపత్రం ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా 1,060 పాఠశాలల్లో నాడు- నేడు పనులు 50 శాతం లోపు పూర్తయినట్లు పేర్కొన్నారు. మరుగుదొడ్లు, విద్యుద్దీపాలు, భవనాలకు రంగులు తదితర పనులు చేయాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. ఫిబ్రవరి 15కే పనులన్నీ అయిపోవాలన్న లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. వచ్చే నెల నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించే అవకాశముందన్నారు. పాఠశాలల పరిశుభ్రతకు అమ్మఒడి నిధులను జేసీ, డీఈవోతో కలసి బ్యాంకు ఖాతాను ప్రారంభిస్తే ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. 400 మంది లోపు పిల్లలున్న పాఠశాలకు ఒకరు, 400 నుంచి 800 లోపు ఉంటే ఇద్దరు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్‌ఎస్‌ఏ అధికారి ఎస్‌వీ రత్నంబాబు, ఎంఈవో జ్యోతి తదితరులున్నారు.

నేటి నుంచి అభ్యసన తరగతులు

 కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటగా పదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించిన అధికారులు.. క్రమంగా 9, 8, 7, 6కు రోజు మార్చి రోజు మధ్యాహ్నం వరకు విద్యా బోధన చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఎప్పుడు బడులు ప్రారంభిస్తారన్న దానిపై స్పష్టత లేదు. పదో తరగతికి మాత్రం రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం 4.30 వరకు ప్రత్యేక కార్యచరణతో బోధన సాగిస్తున్నారు. తాజాగా ఉదయం 8.45 నుంచి 1.50 వరకు తరగతులు నిర్వహిస్తూ.. భోజన విరామానాంతరం మధ్యాహ్నం నుంచి చదివించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇకపై చివర్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను డీఈవో ప్రధానోపాధ్యాయులకు పంపారు. పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేసే క్రమంలో శనివారం నుంచి ఏప్రిల్‌ 30 వరకు దీన్ని అమలు చేయనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "About 10th Class Examinations"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0