AP Teachers Transfers 2020
ఉపాధ్యాయ ఖాళీలపై తకరారు!
లెక్క తీసేందుకు కసరత్తు చేస్తున్న సిబ్బంది
అనంతపురం విద్య, న్యూస్‌టుడే:
- ‘ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి తాడిమర్రి, గుత్తి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో జిల్లా అధికారులు ఖాళీలు చూపలేదు. అయితే రాష్ట్ర విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన తుది జాబితాలో ఖాళీలు చూపడంతో కలకలం రేగుతోంది. ఆ పోస్టులకు ఎవరైనా ఆప్షన్ ఇచ్చుకుని ఉంటే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకంగా మారింది.’
- ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కొత్త కోణం వెలుగు చూసింది. పునర్విభజన చేసి తుది ఖాళీల వివరాలను కమిషనర్ వెబ్సైట్లో అనుసంధానం చేయగా.. లెక్క తారుమారైంది. సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామ్ చేయడంలో జరిగిన పొరపాటు ఉపాధ్యాయులకు సంకటంగా మారింది.
- సాధారణంగా పదవీ విరమణ కంటే రెండేళ్ల ముందు బదిలీలు ఉండవు.
- ఈ మేరకు ఖాళీలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో పోస్టులు రద్దుచేసి, మరో చోటుకు బదలాయించారు.
- పునర్విభజనలో భాగంగా 58 ఏళ్ల వయసు ఉన్న ఉపాధ్యాయులు 93 మంది ఉన్నారు.
- కొందరు 58 ఏళ్లు దాటి, తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నా.. పనిచేసే చోటే ఉంటామని డిక్లరేషన్ ఇస్తే బదిలీ చేయకూడదు.
- మరో ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టంగా ఉన్నట్లు అంగీకార పత్రం ఇస్తే బదిలీ చేయవచ్ఛు కానీ జిల్లా విద్యాశాఖ పంపిన ఖాళీలకు, రాష్ట్ర ఐటీ సెల్ వెబ్సైట్లో చూపిన వాటికి తేడాలు ఉన్నాయి.
- వెబ్సైట్లో చూపిన ఖాళీల్లో పోస్టు లేకుంటే పరిస్థితి ఏమిటని తలలు పట్టుకుంటున్నారు.
- ఏయే ప్రాంతాల్లో తప్పు జరిగిందో లెక్క తీస్తుండగా.. శనివారం రాత్రి వరకు కొన్ని తేలాయి. ఇంకా పలు మండలాల్లో వివరాలు అందాల్సి ఉంది.
0 Response to "AP Teachers Transfers 2020"
Post a Comment