Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TEACHERS PRC

 పీఆర్సీ దేవుడెరుగు కరువుభత్యమైనా దక్కేనా ?

TEACHERS PRC

  • పెండింగు లో ఐదు డీఏలు వడ్డీ నష్టం .. - ఈ నెలతో కలిపితే ఆరు
  • రూ . 8 వేలకోట్ల బకాయిలు
  • ఏనాడూ రెండు దాటలేదు కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితి " ఉద్యోగుల మౌన రోదన


అమరావతి - ఆంధ్రజ్యోతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దిష్టకాలంలో వేత నసవరణ చేయడం ఆనవాయితీ . అది క్రమం తప్పకుండా ఏ ప్రభుత్వాలున్నా చేస్తాయి . అయితే ఇప్పుడు పీఆర్సీ సంగతి దేవుడెరుగు . కనీసం కరువు భత్యం బకాయిలు కూడా రావడం లేదని ఉద్యోగులు మథనపడుతున్నారు . గత కొన్నేళ్ల కాలంలో ఎప్పుడూ లేనన్ని డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి . రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి . ఈ నెలతో మరో డీఏ కలుస్తుంది . అంటే ఆరు డీఏలు . ప్రభుత్వం మాత్రం జనవరిలో ఒక డీఏ చెల్లిస్తా నంది . అంటే ఇంకా ఐదు డీఏలు పెండింగ్ లో ఉంటాయి . ఈ పెండింగ్ డీఏలకు ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.ఎనిమిది వేల కోట్లు ఉంటుంది . డీఏ చెల్లింపు పరిస్థితే ఇలా ఉంటే ఇక పీఆర్సీ సంగతి ఏంటో అన్న ఆందోళనను పలు వురు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు . సార్లు .... జనవరి , జూలై నెలల్లో డీఏను ప్రకటిస్తారు . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా ఇచ్చే డీఏ సుమా రుగా నెలకు రూ .100 కోట్లు ఉంటుంది . పెరుగు తున్న ధరలకు అనుగుణంగా వీరి జీతాలు ఎప్పటి కప్పుడు పెంచలేరు . కాబట్టి ... ఈ కరువు భత్యం చెల్లిస్తారు . సాధారణంగా ఏ ప్రభుత్వమున్నా డీఏ లను ప్రకటిస్తాయి . రెండు డీఏలకు మించి పెండింగ్ లో పెట్టకుండా చెల్లిస్తుంటాయి . కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది . 2018 జూలై , 2019 జనవరి , 2019 జూలై , 2020 జనవరి , 2020 జూలైల డీఏలు పెండింగ్ లో ఉన్నాయి . ఇందులో 2018 జూలై , 2018 జనవరి డీఏలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్నాయి . అప్పటి ప్రభుత్వంలో మూడు డీఏలు పెండింగ్ లో ఉంటే ఒకటి చెల్లించి రెండు డీఏలు బకాయిలు పెట్టారు . కానీ ఇప్పుడు ఆ రెండింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించాల్సిన మూడు బకాయి లు ... అంటే మొత్తం ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి . ఏటా సుమారు రూ .100 కోట్ల చొప్పున ఈ డీఏను లెక్కిస్తే ... 2018 జూలై డీఏకు..నాటి నుంచి నేటివరకు 30 నెలల పాటు రూ .8 వేల కోట్లు చెల్లిం చాలి . 2019 జనవరి డీఏను అప్పటినుంచి గత డిసెంబరు వరకు అంటే 24 నెలలకు రూ .2400 కోట్లు చెల్లించాలి . 2019 జూలై డీఏ కింద రూ .1800 కోట్లు , 2020 జనవరి డీఏ కింద రూ .1200 కోట్లు చెల్లించాలి . ఇవన్నీ కలిపితే సుమారు రూ .8,400 కోట్లు అవుతాయి . పడిపోతున్న రూపాయి విలువ , వెరు గుతున్న ధరలకు అనుగుణంగా డీఏను ఇస్తారు . డీఏ ఇంత అని నిర్ణ యించాక .... ఎప్పుడిచ్చినా దానిపై వడ్డీ ఉండదు . ఎంత నిర్ణయించారో అంతే ఇస్తారు . ఉదాహరణకు 2018 జూలైలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కలిపి నెలకు రూ .100 కోట్లు డీఏ అని నిర్ణయి .... దాన్ని 2021 లో చెల్లించినా అదే రూ .100 కోట్లను చెల్లిస్తారు . అంటే 30 నెలల పాటు దానికి వడ్డీ ఉండదు . 2018 లో రావాల్సిన కరువు భత్యం మూడేళ్ల తర్వాత రావడం వల్ల ఉద్యో గులు .. తమ అవసరాల కోసం ఇతర చోట్ల అప్పులు చేయాల్సి ఉంటుంది . అందరు ఉద్యోగులకు అని కాకున్నా .. మూడు , నాలుగో తరగతి ఉద్యోగులకు ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది . తమ అవసరాల కోసం ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటే దానికి వడ్డీ చెల్లిం చాల్సి వస్తుంది . అదే డీఏ అందితే ఆ బాధ ఉండదు అని ఉద్యోగులు అంటు న్నారు . అదే సమయంలో నిజాయి తీగా ఉండే ఉద్యోగులకు కూడా డీఏ డబ్బులు సకాలంలో రాకపోవడంతో బతుకు బండి నడపడం కష్టతరమే అవుతుందని చెబుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TEACHERS PRC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0