Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

People do not have to worry RBI AG revealed

 ఏప్రిల్‌లోగా ఉప‌సంహ‌ర‌ణ‌

People do not have to worry  RBI AG revealed

ప్ర‌జ‌లకు ఆందోళ‌న వ‌ద్దు

ఆర్బీఐ ఏజీ వెల్ల‌డి

రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు కూడాఏప్రిల్‌లోగా ఉపసంహరించనున్న ఆర్బీఐ

ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100 కరెన్సీ నోట్లు త్వరలో కనుమరుగవనున్నాయి. వీటితోపాటు పాత రూ.10, రూ.5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్‌ చివరిలోగా ఉపసంహరించాలని రిజర్వు బ్యాంక్‌ యోచిస్తున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ బీ మహేశ్‌ వెల్లడించారు. 

ముంబై, : పాత రూ.100 నోట్లలో నకిలీ నోట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే వీటిని ఉపసంహరించబోతున్నామని వివరించారు. దేశంలో రూ.10 నాణేన్ని ప్రవేశపెట్టి 15 ఏండ్లు దాటినా ఇప్పటికీ ఎంతో మంది వర్తకులు, వ్యాపారులు వాటిని స్వీకరించడం లేదని, దీంతో ఇవి చెస్టుల్లో భారీగా పేరుకుపోయి బ్యాంకులకు, ఆర్బీఐకి సమస్యగా పరిణమించాయని తెలిపారు. ఇవి చెల్లుబాటు కావంటూ వస్తున్న వదంతుల్లో నిజం లేదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి రూ.10 నాణేల వినియోగాన్ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లావెండర్‌ రంగులో ముద్రించిన కొత్త రూ.100 కరెన్సీ నోట్లను 2019లో రిజర్వు బ్యాంకు చలామణిలోకి తెచ్చిన విషయం విదితమే. వీటి చెల్లుబాటు యథాతథంగానే కొనసాగుతుందని మహేశ్‌ స్పష్టం చేశారు.

 రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు కూడాఏప్రిల్‌లోగా ఉపసంహరించనున్న ఆర్బీఐ

ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 ముఖ విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ జారీ చేస్తున్నది. వీటితోపాటు 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలను చలామణిలో ఉంచిన ఆర్బీఐ.. ఇటీవల రూ.20 నాణేన్ని కూడా ప్రవేశపెట్టింది. 

కానీ రూ.10 నాణేన్ని చలామణిలోకి తెచ్చి 15 ఏండ్లు దాటినా ఇప్పటికీ ఎంతో మంది వర్తకులు, వ్యాపారులు వాటిని స్వీకరించడం లేదని, దీంతో ఇవి చెస్టుల్లో భారీగా పేరుకుపోయి బ్యాంకులకు, ఆర్బీఐకి సమస్యగా పరిణమించాయని మహేశ్‌ తెలిపారు. 

ఇవి చెల్లుబాటు కావంటూ వస్తున్న వదంతుల్లో నిజం లేదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి రూ.10 నాణేల వినియోగాన్ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

రిజర్వు బ్యాంక్‌ నివేదిక ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ నోట్ల చలామణి 14.7 శాతం, వాటి విలువ 6.6 శాతం పెరిగింది. గతేడాది మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువ 83.4 శాతానికి పెరిగింది. 

రూ.500 నోట్ల వాటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. పరిమాణ పరంగా చూస్తే.. గతేడాది మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో రూ.10, రూ.100 నోట్ల వాటా 43.4 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "People do not have to worry RBI AG revealed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0