Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Voter ID card can be downloaded

ఓటరు గుర్తింపు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు

Voter ID card can be downloaded

ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డులు

ఫోన్ ద్వారా కూడా డోన్లోడ్ చేసుకోవచ్చు

కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సదుపాయం

 ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును తమ మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్ లోనూ స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఓటరు గుర్తింపు కార్డును సమీపంలోని మీ-సేవా కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉండేది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్ (ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది. ఓటరు తమ రిజిస్టర్డ్ మొబైల్ లోనే ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.. ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు. 2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా ఈ నెల 25 నుంచి 31 వరకు ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు 'ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఏపిక్ అనే పేరుతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ పోర్టల్ http:// voterportal.eci.gov.in, లేదా జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్ https:// nsvp.in ద్వారా ఈ-ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


Check your vote in Voter Helpline

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Voter ID card can be downloaded"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0