Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ricemel in front of the house .. Innovative idea of ​​a young man .. Ideal for many with self employment

 ఇంటి ముందుకే రైస్మెల్ .. యువకుడి వినూత్న ఆలోచన .. స్వయం ఉపాధితో పలువురికి ఆదర్శం

Ricemel in front of the house .. Innovative idea of ​​a young man .. Ideal for many with self employment


Nirmala Mini Rice Mill: వినూత్న ఆలోచనతో ఓ యువకుడు ఉపాధి పొందుతున్నాడు. అందరి కంటే భిన్నంగా ఆలోచించి అమలు చేస్తున్నాడు. ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా స్వయం ఉపాధిని ఎంచుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్‌ జిల్లా తల్వెద గ్రామానికి చెందిన ఎలిశెట్టి శ్రీధర్‌.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెఎస్‌డబ్ల్యూతో పాటు బీఈడీ పూర్తి చేశాడు. అయితే ఉద్యోగం రాలేదని దిగులు చెందకుండా వినూత్న రీతిలో ఆలోచించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. సాధారణంగా బియ్యం కావాలంటే వడ్ల నూర్పిడి చేయాలి. అయితే వడ్లను రైస్‌ మిల్‌కి తీసుకెళ్లాలంటే వాహనం కావాలి.. దీనివల్ల డబ్బు ఖర్చుతో పాటు సమయం కూడా వృధా అవుతుంది.

ఇలాంటి ప్రయాసలు లేకుండా ఇంటి దగ్గరకే బియ్యం వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది శ్రీధర్‌కి.. వెంటనే సోషల్‌ మీడియాలో అన్వేషణ ప్రారంభించాడు. అతని అన్వేషణ ఫలించింది. ఓ మినీ రైస్‌ మిల్‌ అతనికి కనిపించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దగ్గర ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు శ్రీధర్‌. ఈ మినీ రైస్‌ మిల్‌ని చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చానని అతడు చెప్పడంతో అక్కడి నుంచి అటే బయల్దేరి చత్తీస్‌గఢ్‌లో మినీ రైస్‌ మిల్‌ కొనుగోలు చేశాడు శ్రీధర్‌.

చత్తీస్‌గఢ్‌ నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా మినీ రైస్‌మిల్‌ని సొంత గ్రామానికి తీసుకొచ్చాడు శ్రీధర్‌. మొదట తన రెండెకరాల పొలంలో పండిన సన్న రకం వడ్లను నూర్పిడి చేసి, ఆ బియ్యాన్ని ఇతరులకు విక్రయించాడు. ఇది గమనించిన స్థానికులు ఒక్కొక్కరుగా తమ ధాన్యాన్ని నూర్పిడి చేయించుకోవడం ప్రారంభించారు. బ్రౌన్‌, సెమీ బ్రౌన్‌, పాలిష్‌ రకాల పద్దతుల్లో బియ్యాన్ని నూర్పిడి చేయించుకుంటున్నారు. సాధారణ రైస్‌ మిల్‌తో పోల్చితే దీనిద్వారా క్వింటాల్‌కు 5 నుంచి 10 కేజీల బియ్యం అదనంగా వస్తున్నాయని శ్రీధర్‌ చెబుతున్నాడు. తవుడును వేరు చేసే పద్దతి కూడా ఇందులో ఉందంటున్నాడు.

మినీ రైస్‌మిల్‌లో నూక బియ్యం ఉండవని, వాహనాల ఖర్చుతో పాటు సమయం వృధా కావడాన్ని కూడా తగ్గించవచ్చు. యంత్రానికి 4 చక్రాలను అమర్చడంతో ఒక దగ్గరి నుంచి ఇంకో ప్రాంతానికి సులభంగా దీన్ని తరలించవచ్చు. దీంతో వారి ఇంటి దగ్గరికి వెళ్లి ధాన్యాన్ని నూర్పిడి చేసే అవకాశం ఉంది. ఇది 60 కేజీల బరువు కలిగి ఉంది. దీనికి 3 హెచ్‌పి మోటార్‌ అమర్చి ఉంది. సింగిల్‌ ఫేస్‌ కరెంట్‌తో గంటకు రెండు క్వింటాళ్ల వడ్లను నూర్పిడి చేయవచ్చు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ricemel in front of the house .. Innovative idea of ​​a young man .. Ideal for many with self employment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0