Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI services at home

 ఇంటి వద్దకే SBI సేవలు

SBI services at home

"డోర్ స్టెప్ బ్యాంకింగ్" తో మెరుగైన సౌకర్యాలు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్టరైతే చాలు  నగదు విత్ డ్రా , డిపాజిట్ తోపాటు డబ్బును ఇంటికి తెప్పించుకునే వీలు

ముంబయి : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్ బీఐ ) ఇటీవల తన డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది . గతేడాది కరోనా వ్యాప్తి తర్వాత సాధారణ కార్యకలాపాలు మొదలైనప్పటికీ పరి స్థితుల్లో మార్పులొచ్చాయి . వృద్ధులు , ఆరోగ్య సమస్యలు ఉన్నవారు . ఇప్పటికీ బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు . ముఖ్యంగా డిజిటల్ వినియోగం ఇదివరకటి కంటే వేగవంతం కావడంతో అనేక రంగాల్లో కార్యకలాపాలు , సేవలు మరింత సులభతరం అయ్యాయి . ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత ప్రయోజనకరంగా అందిం చేందుకు ఎస్ బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది . ఈ కొత్త బ్యాంకింగ్ సేవల ద్వారా అన్ని రకాల సౌకర్యాలను వినియోగదా రులు తమ ఇంటివద్దే పొందే అవకాశం ఉంటుంది . నగదును కూడా ఇంటికే తెప్పించు కునే వీలుంటుంది . దీనివల్ల బ్యాంకు సేవలను మరింత సౌకర్యవంతంగా పొందే వీలవుతుంది . డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా లేదంటే బ్యాంకు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకో వాల్సి ఉంటుంది . రిజిస్టర్ అయిన తర్వాత ఎబీఐ బ్యాంకింగ్ సేవలను ఇంటివద్దే పొందవచ్చు . 

గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు .. 

  •  ఈ కొత్త బ్యాంకింగ్ సేవల్లో నగదును తీసుకోవడం , నగదును పంపించడం , చెక్ తీసుకోవడం , చెక్ రిక్వెజేషన్ స్లిప్ అందుకోవడం , 15 హెచ్ ఫాం , డ్రాఫ్టులను పంపించడం , టర్మ్ డిపాజిట్ అడ్వెజ్ డెలివరీ చేయడం , లైఫ్ సర్టిఫికెట్ ను తీసుకోవడం , కేవైసీ డాక్యుమెంట్లను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది . అంతేకాకుండా అకౌంట్ స్టేట్ మెంట్ సేవలు కూడా పొందవచ్చు .  
  • డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకు పని దినాల్లో సంప్రదించవచ్చు . బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ 1800111 03 కి సంప్రదించాల్సి ఉంటుంది . 
  • డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల రిజిస్ట్రేషన్ హోమ్ బ్రాంచ్ లో జరుగుతుంది . 
  • ముఖ్యంగా కేవైసీ నిబంధనలు సరిగా ఉన్న వారికి మాత్రమే డొర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి .

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల చార్జీలు .

ఆర్థిక సేవలు : 

  •  నగదును డిపాజిట్ చేసేందుకు - రూ .75 తో పాటు జీఎస్టీ చార్జీలు అదనం 
  • నగదు చెల్లింపులు లేదా విత్ డ్రా - రూ .75 తోపాటు జీఎస్టీ అదనం .  
  • చెక్ పికప్ - రూ .75 తో పాటు అదనంగా జీఎస్టీ 
  • చెబుక్ రిక్వెఐజేషన్ స్లిప్ రూ .75 తో పాటు జీఎస్టీ అదనం . 

ఆర్థికేతర సేవలు : 

  • టర్మ్ డిపాజిట్ అడ్వెజ్ తో పాటు అకౌంట్ స్టేట్ మెంట్ ఉచితంగా పొందవచ్చు . 
  • కరెంట్ అకౌంట్ స్టేట్ మెంట్ కోసం రూ .100 తో పాటు జీఎస్టీ అదనం.

ఇతర నిబంధనలు .. 

  • నగదు విత్ డ్రా , డిపాజిట్ మొత్తం రోజుకు
  • రూ .20,000 వరకే పరిమితం . 
  • బ్యాంకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉండి , మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన వినియోగదారులు ఈ సేవలను పొందే వీలుంటుంది . 
  • జాయింట్ అకౌంట్ కలిగిన వారు ఈ సేవలను పొందడానికి వీలవదు . 
  • అదేవిధంగా మైనర్ అకౌంట్ , వ్యక్తిగతం కాని అకౌంట్ల సేవలు అందుబాటులో ఉండవు . 
  • నగదు విత్ డ్రాను చెక్ బుక్ ద్వారా లేదంటే పాస్ బుక్ , విత్ డ్రా ఫాం ద్వారా చేసుకునే వీలుంటుంది .
  • కాగా , కరోనా నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని SBI తో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్ , హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , ఇండండ్ బ్యాంకు సైతం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తు న్నాయి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI services at home"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0