Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The daily routine should be changed to the bell ringing

 మోగనుంది బడిగంట మారాలి దినచర్య

The daily routine should be changed to the bell ringing


లాక్‌డౌన్‌తో మారిన విద్యార్థుల జీవన విధానం

పాఠశాల వాతావరణానికి తగట్టు సమాయత్తం చేయాలి.

పాఠశాలల పునఃప్రారంభ అనంతరం పిల్లల నుంచి ఎదురయ్యే సవాళ్లపై అనుసరించాల్సిన వ్యూహాలను యూనిసెఫ్‌ సూచించింది. వారు మానసికంగా సంసిద్ధమయ్యేలా దినచర్యను మార్చడం, బడిపై భయాలు పోగొట్టడం వంటి చర్యలు ఆరంభించాలని సూచించింది. అవేంటో తెలుసుకుందాం.

  • ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి
  • పది నెలలుగా ఇంటి వద్దే ఉంటున్న పిల్లలు తమకు నచ్చినట్లు గడిపారు

ఒక్కసారిగా బడికి వెళ్లమంటే ఆందోళనకు గురవుతారు. ఇల్లు, బడి వాతావరణంపై చర్చ లేవనెత్తి వారి స్పందనలు గమనించాలి. ప్రతికూల ఆలోచనలతో బడిలో అడుగుపెట్టే విద్యార్థికి అన్నీ సమస్యగానే కనిపిస్తాయి. స్నేహితులు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గతంలో సాధించిన విజయాలు గుర్తు చేస్తూ బడికి వెళ్లాలనే ఆసక్తి పుట్టించాలి.

శుభ్రతపై అవగాహన

కరోనా వేళ అత్యంత ప్రాధాన్య అంశం శుభ్రత. చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటివి తప్పనిసరి అంశాలయ్యాయి. బడికి వెళితే ఉపాధ్యాయులే అందరిని ప్రత్యేకంగా పరిశీలించడం సాధ్యపడదు. పిల్లలే స్వతహాగా ఈ మూడు స్వీయ జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలి. తమతోపాటు మిత్రుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే జాగ్రత్తగా ఉండటం వంటివి వివరించాలి.

మాటలకు విలువివ్వాలి

ప్రత్యక్ష తరగతులు నిర్వహించినా గ్యాడ్జెట్స్‌ అవసరాలు నుంచి విడదీయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాటి వినియోగంపై ఒక కన్నెయ్యాలి. ఏ యాప్‌లు వినియోగిస్తున్నారు..? ఎవరితో చాటింగ్‌ చేస్తున్నారో చెప్పగలిగే స్వేచ్ఛ వారికివ్వాలి. స్నేహపూర్వకంగా మాట్లాడినప్పుడే ఇది సాధ్యపడుతుంది. బడిలో, ఆన్‌లైన్‌లోని స్నేహితుల సమాచారం తెలుసుకుని ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పాలి. బడిలోని ఇబ్బందులు అడిగి తెలుసుకోవాలి. వాస్తవాలను తెలుసుకోవడానికి పాఠశాల యంత్రాంగాన్ని సంప్రదించాలి.

భరోసా కల్పించాలి

పాఠశాల అనగానే పిల్లల్లో కొన్ని భయాలు సాధారణంగా ఉంటాయి. వాటిని తొలగించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. పది మాసాల సిలబస్‌ను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే ఆలోచనను ఉపాధ్యాయులు వీడాలి. ఎక్కువ మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలబడాలనే తపన తల్లిదండ్రులు వదిలేయాలి. ఆన్‌లైన్‌ తరగతుల్లో పొందిన విషయ పరిజ్ఞానం వారి సామర్థ్యాల ఆధారంగా ఉంటుంది. ప్రత్యక్ష తరగతుల్లో వీటిపై ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పగలనా? అనే భయాందోళనలు పిల్లల్లో సహజంగానే ఉంటాయి. అందుకే ఇతర విద్యార్థులతో పోల్చడం, ఒకేసారి అధిక భారం వేయడం వారిని భయభ్రాంతులకు గురిచేయకుండా భరోసానివ్వాలి.

ఏడు గంటల కల్లా నిద్ర లేచి స్నానం చేసి యూనిఫాం వేసుకుని అల్పాహారం తినేసి బడికెళ్లేవారు. సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు ఆడుకుని హోంవర్క్‌ పూర్తిచేసి త్వరగా పడుకునేవారు.

ఇదీ లాక్‌డౌన్‌కు ముందు వరకు విద్యార్థుల జీవనశైలి

మెలకువ వచ్చినప్పుడు నిద్రలేచి వెంటనే అరచేతిలో ఫోన్‌ పట్టుకుని పాఠాలు వింటూ బుద్ధి పుట్టినప్పుడు తినడం. ఆన్‌లైన్‌ తరగతుల్లో ఇచ్చిన హోంవర్క్‌ పూర్తిచేశాక గంటల తరబడి గ్యాడ్జెట్‌లోనే నిమగ్నమవడం.

ఇదీ లాక్‌డౌన్‌ నుంచి అనుసరిస్తున్న జీవన విధానం.

కరోనా కారణంగా సుదీర్ఘ కాలం బడులు మూతబడటంతో విద్యార్థుల జీవన శైలే మారిపోయింది. క్రమపద్ధతిలో సాగిన దినచర్య గతి తప్పింది. వచ్చే నెల నుంచి బడులు తెరుచుకోనున్నాయి. పది నెలలు ఇంటికే పరిమితమై, గ్యాడ్జెట్లకు అలవాటైన విద్యార్థులు ఇప్పుడు బడికెళ్లమంటే ఎలా స్పందిస్తారనేదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

దినచర్య సరిచేయాలి

పడుకోవడం, లేవడం, భోజన వేళలు ఇంతకు ముందులా లేవు. ఇన్నాళ్ల ఈ దినచర్యను బడికి పోయే ముందు రోజే మార్చుకోమంటే బద్ధకం ప్రదర్శిస్తారు. వారి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపచ్ఛు ప్రధానంగా నిద్రలేమి, అజీర్తి వంటివి తలెత్తవచ్ఛు వేళకు తినేలా, పడుకునేలా వారం ముందు నుంచే వారిని అలవాటు చేయాలి. గ్యాడ్జెట్స్‌ వినియోగాన్ని తగ్గించాలి. మొత్తంగా లాక్‌డౌన్‌కు పూర్వం దినచర్య అలవాటు చేయాలి.

ముందు నుంచే మలచాలి

- డాక్టర్‌ విశాల్‌, సైకియాట్రిక్‌


ఇప్పుడు పాటిస్తున్న జీవన విధానాన్ని ఒక్కసారిగా మార్చుకోవాలంటే పిల్లలు ఇబ్బంది పడతారు. ఆన్‌లైన్‌ తరగతులంటూ స్క్రీన్‌పై గడిపే సమయం పెరిగింది. పడుకునే వేళలు, ఆహారం తీసుకోవడంలో అనూహ్య మార్పులొచ్చాయి. ఇప్పటి నుంచే వారితో మాట్లాడుతూ జీవనశైలి మార్చుకునేలా ప్రోత్సహించాలి. భయాలు తొలగించడం, సమయానికి నిద్రపుచ్చడం, బడి వాతావరణంపై సానుకూల వైఖరి ఏర్పర్చాలి.





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The daily routine should be changed to the bell ringing"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0